ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలి : మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

0
Spread the love

ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలి

అధికారుల‌ను ఆదేశించిన‌ జిల్లా ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) :

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడంతో పాటు, ముంపుకు గురైన ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. పి. అనిల్ కుమార్, జిల్లా కలెక్టరు కె. వి.ఎన్. చక్రధర్ బాబుతో కలసి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని వరద ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యల వలన ప్రాణ నష్టం జరగ లేదని తెలుపుతూ ఈ సందర్భంగా మంత్రి, వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న రెవిన్యూ, పోలీసు, ఎన్.డి.ఆర్.ఎఫ్. ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందిని, ఇతర శాఖల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

దురదృష్టవశాత్తు పాలిటెక్నిక్ విద్యార్థి మరియు వరద సహాయక చర్యల్లో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్.డి.ఆర్.ఎఫ్. కాని స్టేబుల్ మరణించడం జరిగిందన్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా 5 లక్షల రూపాయల ఎక్సగ్రేషియా అందించడం జరిగిందని, అలాగే మృతి చెందిన ఎస్.డి.ఆర్.ఎఫ్. కాని స్టేబుల్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు, మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న గృహాలు, పంటల వివరాలు కచ్చితంగా సేకరించి బాధి తులకు సత్వరం సహాయం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి మంత్రి, అధికారులను ఆదేశించారు.

కోవూరు నియోజక వర్గ శాసన సభ్యులు న‌ల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, కోవూరు నియోజక వర్గ పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరు పేట, కొడవలూరు మండలాలలోని ఎక్కువ గ్రామాలు వరదలు కారణంగా ముంపుకు గురికావడం జరిగిందని, ఈ ప్రాంతాల్లో దెబ్బతిన్న ఆర్. అండ్ బి.. మరియు పంచాయతీ రాజ్ రోడ్లను త్వరగా శాశ్వత ప్రాతిపదిక పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది.

వరదలు కారణంగా కోవూరు నియోజక వర్గ పరిధిలోని చేపల చెరువులు, రొయ్యల చెరువులు దెబ్బతినడం జరిగిందని, అలాగే వ్యవసాయ భూముల్లో ఇసుక మేట వేయడం జరిగిందని, ప్రభుత్వం వీరిని ఆదుకోవల్సిన అవసరం ఉందన్నారు.

తొలుత జిల్లా కలెక్టరు కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యల పై, జరిగిన నష్టాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి వివరించడం జరిగింది.

జిల్లాలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ పశు సంవర్ధక శాఖ, ఆర్.అండ్ బి., పంచాయతీ రాజ్, హౌసింగ్ , జలవనరుల శాఖ, మునిసిపల్ శాఖ, ఆర్.డబ్ల్యు.ఎస్., వైద్య మరియు విద్యుత్ శాఖలకు ప్రాధమిక అంచనాల మేరకు 535 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టరు చక్రధర్ బాబు, మంత్రి శ్రీనివాస రెడ్డికి వివరించారు.

జిల్లా ఎస్.పి  సి. హెచ్. విజయరావు, ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో పోలీసు శాఖ సిబ్బంది చేపట్టిన కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి కి వివరించారు.
ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్  పొట్లూరి స్రవంతి, నెల్లూరు రూరల్ నియోజక వర్గ శాసన సభ్యులు  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు  హరేంధిర ప్రసాద్,  గణేష్ కుమార్ ,  విధేహ్ ఖరే,  రోజ్ మాండ్, నెల్లూరు నగర పాలక సంస్థ కమీషనర్  దినేష్ కుమార్, అడిషనల్ ఎస్.పి.  వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!