భార్యభర్తల హత్య కేసులో సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ
భార్యభర్తల హత్య కేసులో సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ
నెల్లూరు క్రైం, ఆగస్టు 28 (సదా మీకోసం):
నెల్లూరు నగరం లోని అశోక్ నగర్ లో జరిగిన భార్యభర్తల హత్య కేసులో సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ విజయరావు స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వేదాయపాలెం స్టేషన్ నందు కేసు నమోదు చేసి అన్ని కోణాలలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హత్య జరిగిన ఘటనపై ఆరా తీసిన ఎస్పీ, ఘటన ఎలా జరిగింది, కేసును లోతుగా దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన ఛేదించాలని ఆదేశాలు జారీచేశారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని పలు సలహాలు, సూచనలు చేశారు.
సిసి కెమెరాలను, చుట్టుపక్కల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఎస్పీ విచారించారు.
ముద్దాయిల కొరకు బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
అనుమానాస్పదులను అదుపులోకి తీసుకుని విచారించాలని ఆదేశించారు.
నేరం జరిగిన తీరుని బట్టి ఫింగర్ ప్రింట్ అధికారులకు జాగ్రత్తగా ఆధారాలు చెరిగిపోకుండా సేకరించాలని సూచన చేశారు.
డాగ్ స్కాడ్ సిబ్బందిచే ఆణువణువూ ముమ్మర గాలింపు చర్యలు భార్యభర్తల హత్య కేసులో సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ .
ఆధారాల ఆధారంగా కేసును త్వరితగతిన చేదించాలని ఆదేశించారు.