చిన్నారుల పట్ల, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలి : సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

0
Spread the love

చిన్నారుల పట్ల, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలి

సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

మనుబోలు, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) :

మనుబోలు మండలం, కొలనకుదురు, కట్టువపల్లి గ్రామాలలో పర్యటించి ఒక కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ప్రజల సమక్షంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షించి, సంతృప్తి వ్యక్తం చేశారు. పురాతనమైన శ్రీ వాహనేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అంగన్వాడి, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులు, చిన్నారులతో ముచ్చటించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి నిత్యం కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం చూస్తుంటేనే, సర్వేపల్లి నియోజకవర్గం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో, ప్రజలకు అర్థమవుతుందన్నారు. తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా గ్రామాలలో తిరగలేకపోయినా, వైకాపా ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యునిగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాన‌ని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అర్హులైన వారందరికీ అందిస్తున్నామ‌న్నారు. దేవాలయాలకు ధర్మకర్తల మండలిలో 50 శాతం మహిళలను నియమించడంతో పాటు, 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి ద‌న్నారు. అంగన్వాడి చిన్నారుల పట్ల, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. అంగన్వాడీ చిన్నారుల సంరక్షణ పట్ల అలసత్వం ప్రదర్శిస్తే, ఉద్యోగాల నుండి తొలగిస్తామ‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!