ములుముడి గ్రామలో వైసిపి ఆవిర్భావ వేడుకలు…… కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

ములుముడి గ్రామలో వైసిపి ఆవిర్భావ వేడుకలు
కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
డీ.సీ.సీ.బీ మాజీ ఛైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి
- బ్రహ్మరధం పట్టిన ములుమూడి గ్రామ ప్రజలు
- కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం
నెల్లూరు జడ్పీ, మార్చి 12 (సదా మీకోసం) :
నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుమూడి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, డీ.సీ.సీ.బీ మాజీ ఛైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆనం అరుణమ్మ, ఆనం విజయ కుమార్ రెడ్డి లకు ములుమూడి గ్రామ ప్రజలు, వైఎస్పార్ సిపి నాయకులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ గారు మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో పార్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
గడచిన 11 ఏళ్ళలో ఎన్నో సవాళ్ళను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి, అధికారంలోకి వచ్చాక, కేవలం రెండున్నరేళ్లలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు అమలు చేయడమే కాక, చెప్పని హామీలతోపాటు, అనేక సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తూ ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ములుమూడి గ్రామం లో పార్టి జెండా ను 12 వ వసంతంలోకి అడుగు వేస్తున్న సందర్భంగా తానూ ఎగరవేయడం ఎంతో సంతోషం గా ఉందని అన్నారు. గత పర్యటనలో ములుమూడి గ్రామం వచ్చినప్పుడు గిజిజనులకు చాల మందికి ఆదార్ కార్డులు లేవని తెలిపిపారని, ఈ మధ్య జరిగిన జడ్పీ స్టాండింగ్ కమిటిలో, ఐ.టి.డి.ఏ అధికారులకు తెలపగా వారు వెంటనే స్పందించి, ములుమూడి గ్రామ గిరిజనులకు ఊరిలో క్యాంప్ పెట్టి కొత్త ఆధార్ కార్డులు ఏర్పాటు చేస్తున్నారని వారికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. అందరికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
అనంతరం డీ.సీ.సీ.బీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మహిళలకు ఎంతో పెద్ద పీట వేశారని పెద్ద పదవులు అయిన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, మేయర్లు గా ఇలా ఎన్నో పదవులు మహిళలకు కేటాయించడం జరిగినదని అన్నారు.
ముఖ్యమంత్రి మన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నారని, ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలతో రాష్ట్రం లోని ప్రజల మన్ననలు చూరగోన్నారని భవిష్యత్తులో కూడా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవలన్నా, ప్రజలకు సంక్షేమ ఫలాలు సక్రమంగా అందాలన్నా, తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ఆ దిశగా ప్రతి ఒక్కరు పార్టీ పటిష్టతకు పాటుపడాలని 2024 లో మరలా మన పార్టీ విజయ పరంపర కొనసాగేలా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ప్రజల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలతొ నవరత్నాలు కార్యక్రమం మొదలు పెట్టారని వాటి వలన ఎంతో మంది పేద బడుగు వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో వైఎస్పార్ సిపి జిల్లా కార్యదర్శి చేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీటిసి సభ్యులు వేమిరెడ్డి హంసకుమార్ రెడ్డి, మాజీ రూరల్ మండల కన్వీనర్ రామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్పార్ సిపి నాయకులు దొడ్ల మస్తానయ్య యాదవ్, బుజ బుజ నెల్లూరు నాయకులు ఖాదర్ బాషా, పొట్టేపాలెం మాజీ సర్పంచ్ కోటేశ్వర రావు, బాబురావు, జయరామిరెడ్డి, కార్యకర్తలు, ములుమూడి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.