అదానీ కృష్ణపట్నం పోర్టులో మెగా వైద్య శిబిరం
అదానీ కృష్ణపట్నం పోర్టులో మెగా వైద్య శిబిరం
ముత్తుకూరు, ఏప్రిల్ 7 (సదా మీకోసం) :
అదానీ కృష్ణపట్నం పోర్టు, అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం పోర్ట్ పునరావాస కాలనీ అదానీ చికిత్సాలయం వద్ద అదానీ కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ అవినాష్ చంద్ రాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం రోజున వైద్య శిబిరం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రీతి అదానీ, అపోలో చైర్మన్ ప్రతీప్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.
ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య స్థితిగతులను గుర్తించి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందని అదానీ పౌండేషన్ సౌత్ సిఈవో అనీల్ బాలకృష్ణన్ పేర్కొన్నారు.
రాబోవు 3 లేదా 4 సంవత్సరాల్లో ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రీతి అదానీ కృషి చేయనున్నట్లు తెలిపారు.
పోర్ట్ పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అదానీ ఫౌండేషన్ తో కలిసి అపోలో ఫౌండేషన్ కృషి చేస్తుందని అపోలో ఫౌండేషన్ సిఈవో సుబ్బన్న తెలిపారు.
10 రోజుల పాటు ఈ వైద్య శిబిరం మొదటి విడత నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ జనరల్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్ లను ఈ ప్రాంత ప్రజలు తప్పక ఉపయోగించుకోవాలని అదానీ పోర్ట్ కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ జి. వేణుగోపాల్ తెలిపారు.
మొదటిరోజు సుమారు 200 మందికి టెస్టులు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ చక్రవర్తి, అడ్మిన్ హెడ్ గణేష్ శర్మ, డాక్టర్లు సుహర్షన్, వెంకటేష్, జాన్ పాల్, శృతి, గాయత్రి, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు, అపోలో ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.