ప్రజా సమస్యలపై స్పందించిన అధికారులకు ధన్యవాదాలు : వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ప్రజా సమస్యలపై స్పందించిన అధికారులకు ధన్యవాదాలు
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్, ఏప్రిల్ 13 (సదా మీకోసం) :
ఇంటి స్థలాలు కొనాలన్నా, అమ్మాలన్నా రిజిస్ట్రేషన్ జరగక కొన్ని వేల కుటుంబాలు ఇబ్బదులు పడుతున్నాయని, ఆ స్థలాలను నిషేదిత జాబితా నుంచి తొలగించాలని అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు అందించడం జరిగింది.
రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాలెం, వేదాయపాలెం, ఎన్.జి.ఓ. కాలనీ, నెల్లూరు బిట్-1, బి.వి. నగర్, కొత్తూరులో నియోజకవర్గ పరిధిలోని నిషేదిత భూములకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
దీనికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ సమస్యలను పరిష్కరించలేకపోయాము. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దీనిపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టి, ఈ నిషేధిత భూముల లిస్టు నుంచి పై తెలిపిన ఏరియాలను తొలగించాలని పలుమార్లు అధికారులతో చర్చించడం జరిగింది.
నేడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) కృషిఫలితం 250 ఎకరాలు నిషేదిత భూముల లిస్టు నుండి తొలగించడం జరిగింది. దీనికి సహకరించిన సంబంధిత అధికారులకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
వీటికి సంబంధించి ఏ సమాచారం కావాలన్నా రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (Kotam Reddy Giridhar Reddy) తెలిపారు.