టిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్
ముత్తుకూరు, మే 16 (సదా మీకోసం) :

ముత్తుకూరు మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ ని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి కార్యకర్తగా పనిచేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు గా పనిచేస్తున్న నీలం మల్లికార్జున యాదవ్ కి ముత్తుకూరు మండల అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం పై పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ముత్తుకూరు మండల అధ్యక్షులుగా ఒక బీసీకి అవకాశం ఇవ్వడం పై పలు పలువురు బిసి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముత్తుకూరు మండల అధ్యక్షులుగా ఒక బిసి కి అవకాశం ఇచ్చి బిసీ ల అభ్యున్నతికి అవకాశం ఇచ్చిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి నాయకులు కార్యకర్తలు, అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.


