దుప్పట్లు పంపిణీ చేసిన ధర్మసింధు

దుప్పట్లు పంపిణీ చేసిన ధర్మసింధు
ఇందుకూరుపేట నవంబరు 28 (సదా మీకోసం)
మండలంలోని గంగపట్నం మజరా కాలువమూలకండ్రిగ గ్రామ వరద బాధితులకు ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మసింధు అధ్యక్షుడు ధన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ మొన్న వచ్చిన వరదలకు అన్నీ పోగొట్టుకుని నిరాశ్రయులైన నిరుపేదలకు సమితి తరపున దుప్పట్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా వుందన్నారు. సమితి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు కాలువమూల కండ్రిగ గ్రామాన్ని సందర్శించడం జరిగిందని, అడిగిన వెంటనే స్పందించి ఆర్ధిక సహకారం అందించిన
దాతలు ప్రభాకర్ వర్మ, భట్టారం సత్యేంద్ర లకు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ నిర్వహకులుగా పోలవరపు కార్తికేయ, గోళ్ళ సతీష్ కుమార్ వ్యవహరించగా, కార్యక్రమంలో
సమితి సభ్యులు గోనుపల్లి నవీన్ కుమార్, పాశం నరసింహరావు, తిరుపతి సాంబశివ, కొత్తింటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.