ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి : షేక్ అబ్దుల్ అజీజ్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి
- నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని ఆపడంతో, ప్రభుత్వ అసమర్థత అర్థం అవుతుంది
- అరెస్టులు, నోటీసులతో ఉద్యమాలను ఆపలేరు
- నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి షేక్ అబ్దుల్ అజీజ్
నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 20 (సదా మీకోసం) :
దళిత సంక్షేమాన్ని, అణగారిన వర్గాలను నిర్వీర్యం చేసి, దళితులను, బీసీ లను, ముస్లిం లను మోసం చేసిన మోసకారి, దళిత ద్రోహి జగన్ మోహన్ రెడ్డి నీ, మోసకారి ప్రభుత్వ తీరును ఎండగడుతూ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళడానికి వీలులేదని, పోలీసు వారు నోటీసులు జారీ చేశారు.
టిడిపి నాయకులకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేయడాన్ని నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ మంగళవారం ఓ ప్రకటన ద్వారా ఖండించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేసి, నోటీసులు ఇవ్వడంతో ఈ ప్రభుత్వ అసమర్థత అర్థం అవుతుంది అని అన్నారు.
మీరు ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని ఉద్యమాలు ఆపిన రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెబుతారు అని తెలిపారు.
అధిక శాతం దళితులు, ముస్లిం ల ఓట్లతో అధికారం పొంది, నేడు వారు న్యాయం కోసం రోడ్ మీదకు వస్తుంటే వాళ్ళను మి అధికార బలంతో కట్టడి చేయాలి అని చూడడం దుర్మార్గం అని పేర్కొన్నారు.
2024 వరకు కట్టడి చేయగలరేమో, తరువాత ప్రజలు ఇచ్చే తీర్పు తో మీ తాడేపల్లి కాళీ అవుతుంది అని గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు.
ప్రజలు అనుకొంటే రాజ్యాలు ఏర్పడడం, కూలిపోవడం మనం ఎన్నో చూశాం. ఇది 2024 లో ఆంద్రప్రదేశ్ లో పునరావృత్తం కానుందని అన్నారు