ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని మోసం చేసింది : అబ్దుల్ అజీజ్

0
Spread the love

ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని మోసం చేసింది

  • వైసీపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు ముస్లింలు అంతా రాష్ట్ర వ్యాప్తంగా సమర భేరీ మోగిస్తునే ఉంటాం….
  • మేక తోలు కప్పుకున్న పులి వైఎస్ జగన్
  • దివంగత వైఎస్ఆర్ వేరు నేడు జగన్ వేరు
  • ఎన్టీఆర్ క్యాంటీన్ లు మూసివేసి పేదల నోటి కాడ కూడు తీశారు
  • నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే … కోటంరెడ్డి ఓ డ్రామా యాక్టర్….
  • 30 లక్షలతో ఒక గోడ కట్టి ముస్లింలను ఉద్ధరించినట్లు ప్రగల్బాలు చెబుతున్నాడు
  • మైనార్టీలతో జగన్ ప్రభుత్వ పతనం ఖాయం
  • రాజు అనేవాడు ప్రజలను రక్షించాలే తప్ప భక్షించకూడదు
  • నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జి అబ్దుల్ అజీజ్

నెల్లూరు ప్ర‌తినిధి, మార్చి 31 (స‌దా మీకోసం) :

నెల్లూరులో మాగుంట లేఅవుట్ వద్ద ఉన్న పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం లో గురువారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో జగన్ సర్కార్ పై ముస్లింల సమరభేరి కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా నలుమూలల నుండి మైనారిటీ నాయకులు వేలాదిగా పాల్గొన్నారు.ముందుగా నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.. అనంతరం ఢంకా మోగించి సమర భేరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రాంగణానికి లాల్ జాన్ బాషా ప్రాంగణంగా పెట్టారు.

ఈ సంద‌ర్భంగా అబ్ధుల్‌ అజీజ్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ముస్లిం ఆడబిడ్డల పై అరాచకాలు విపరీతంగా జరగడం లేదా…పలమనేరులో పదవ తరగతి చదువుతున్న మిస్బా అనే ముస్లిం ఆడబిడ్డ వైసీపీ నాయకుల అరాచకానికి బలి అవ్వడం బాధాకరం అన్నారు.

వైసీపీ దుర్మార్గపు పాలనలో అబ్దుల్ సలాం కుటుంబం బలైన విషయం అందరికీ తెలిసిందే ఆ పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదన్నదే చంద్రబాబు ఆలోచన అని, వైసీపీ నాయకులు ముస్లింల స్థలాలు, డబ్బులు లాక్కుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం లేదా అని ప్ర‌శ్నించారు.

వైసీపీ నిరంకుశ పాలనలో ముస్లిం సమాజం బతకలేని పరిస్థితి నెలకొందని, టీడీపీ ప్రభుత్వం ముస్లిం ఆడబిడ్డలకు దుల్హన్ పథకం కింద రూ.50 వేలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో దుల్హన్ పథకం కింద రూ.లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ పథకం ఎక్కడా అని ప్ర‌శ్నించారు.

టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముస్లింలకు పెద్దపీట వేస్తూ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు, ఇమామ్, మౌజనులకు జీతాలు, రంజాన్ తోఫా వంటి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు.

ముస్లింల అభ్యున్నతికి చంద్రబాబు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటన్నిటినీ అమలు చేస్తుందా అంటే చేయడం లేదనే చెప్పాలన్నారు. ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తూ మోసం చేస్తుందన్న అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయని తెలిపారు.

స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి వెనుకబడిన వర్గాల తోపాటు ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్ద పీట వేస్తూ రాజకీయ ప్రాధాన్యం కల్పించారని, తెలుగుదేశం పార్టీలో దివంగత లాల్ జాన్ బాషా తోపాటు అనేక మంది ముస్లిం నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

ముస్లిం సమాజం ఎక్కువగా చేతి వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నారని, చేతి వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ముస్లింలకు గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనార్టీ కార్పొరేషన్ లేకుండానే చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని దుయ్య‌బ‌ట్టారు.

స్వాతంత్రం నాటినుండి మొన్నటి వరకు శాసనసభలో ముస్లింల ప్రజాప్రతినిధుల సంఖ్య 25 శాతం ఉండగా నేడు ఆ సంఖ్య రెండు శాతానికి పడిపోయిందన్నారు.

ఇప్పటికైనా మనమందరం మేల్కొని ముస్లిం సమాజానికి చైతన్యపరిచి ముస్లింల హక్కుల పై, ముస్లింలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుదామ‌ని పిలుపునిచ్చారు.

ముస్లిం సమాజానికి మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మనమందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

గత మూడు సంవత్సరాలలో ముస్లిం మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమి లేదని ఆరోపించారు.

ముస్లింలకు కనీస అవసరాలు అయినా ఒక మసీదు కానీ ఒక స్మశాన నిర్మాణానికి గాని నిధులు మంజూరు చేయలేదని ఎన్నికల్లో ముస్లిం ఓట్లను సంపాదించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పూర్తిగా విస్మరించారని అన్నారు.

అందుకే రాష్ట్రంలో తొలిసారిగా నెల్లూరు నుంచే జగన్ సర్కార్ పై మైనారిటీలు సమరభేరీ కార్యక్రమాన్ని ప్రారంభించారని, గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు.

రంజాన్ పర్వదినాన, రంజాన్ తోఫా వంటి పథకాలను అమలు చేసి ముస్లింల మనసులో ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వంలో ముస్లింలకు ఒరగ పెట్టింది ఏమి లేదని ఆయన విమర్శించారు.

త్వరలో అన్ని జిల్లాల్లో కూడా ముస్లిం మైనారిటీలు జగన్ సర్కార్ వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని అన్నారు.

అంతకుముందు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గత ఎన్నికల్లో కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మేక తోలు కప్పుకున్న పులి అని టిడిపి నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతి రోజు లక్షలాది మంది భోజనం చేస్తుంటే వాటిని మూయించి వారి నోటి కాడ కూడు తీసిన ఘనత జగన్ కే దక్కిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గత తెలుగుదేశం పార్టీలో నెల్లూరు నగరంలో అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. గత మూడేళ్లుగా ముస్లింల సంక్షేమానికి నీరుగార్చిన ఘనత వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని విమర్శించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డ్రామా యాక్టర్ ను మించి పోతున్నారని అబ్దుల్ అజీజ్ విమర్శలు గుప్పించారు.

30 లక్షలతో గోడ నిర్మించి నేడు ప్రగల్భాలు చెప్పుకుంటున్న ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కే దక్కుతుందని చెప్పారు. నెల్లూరు రూరల్ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర పడిందని ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్లలో విద్యార్థుల అభ్యున్నతికి ఏం చర్యలు తీసుకున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముస్లిం యువత కోసం ట్రైనింగ్ సెంటర్ ను నెల్లూరు లో ఏర్పాటు చేస్తే దాంట్లో చికెన్ పకోడీ పెట్టించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలన్నారు..

ప్రతి ఒక్క ముస్లిం ధర్మం, న్యాయం కోసం విరోచితంగా పోరాడాలని పోరాడితే పోయేదేమీ లేదన్నారు. పోరాడే కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారని తెలిపారు.

ముస్లిం లకు చెప్పిన అబద్దం చెప్పకుండా అధికారం లోకి వచ్చారు జగన్ మోహన్ రెడ్డి… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ను చూసి గుడ్డిగా జగన్ ను నమ్మారు ముస్లిం లు… ఇద్దరూ వేరని ముస్లిం లు తెలుసుకోవడానికి 3 ఏళ్లు పట్టాయన్నారు. రాజుకు ఉండే లక్షణం ఒక్కటీ జగన్ మోహన్ రెడ్డి లో లేవు. జగన్ మోహన్ రెడ్డి ముద్ద పెట్టే రకం కాదు…. నోటి వద్ద ముద్ద లాగేసే రకం….5 రూ.లకు పేదవాడికి భోజనం ఇచ్చేందుకు మనసు రాని మహారాజు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు మారినా తమిళనాడు లో అమ్మ క్యాంటీన్, కర్ణాటక లో ఇందిరా క్యాంటీన్ లు నిరాటంకంగా సాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్న క్యాంటీన్ ను నిలిపివేశారు. నిధులేమైనా భారతి సిమెంట్ కంపెనీ నుండి లేక సొంత సాక్షి పత్రిక నిధుల నుండి తెస్తున్నారా? పేదవాళ్ళ నోటి వద్ద భోజనం లాగేసిన జగన్ మోహన్ రెడ్డి కి రాజు గా కొనసాగే అర్హత లేదన్నారు. వైసీపీ వ్యవహరిస్తున్న తీరు తో ఒక్క మన బిడ్డల భవిష్యత్తు కే కాదు మొత్తం రాష్ట్రానికే ప్రమాదం పొంచి ఉందన్నారు.

వైసీపీ ప్రభుత్వం వ్యవహార శైలి తో రాష్ట్రం లో ఒక్క పరిశ్రమ నిలవడం లేదు, కొత్త పరిశ్రమ రావడం లేదు…. పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే చరిష్మా ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి అవసరం రాష్ట్రానికి ఉందని తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి ల సహకారం తో మేయర్ నేను, నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కలిసి నెల్లూరు నగరాన్ని 5 వేల కోట్ల రూపాయలతో సుందరం గా తీర్చి దిద్దామన్నారు.

మార్చురీ వాహనాలు, లారీలు, బస్సులు శుభ్రపరుస్తుండటం తో దుర్గంధం గా మారిన స్వర్ణాల చెరువుకు టిడిపి ప్రభుత్వ హయాంలో పవిత్రత ను తీసుకు వచ్చాము. 20 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ది చేశామని, రొట్టెల పండుగ కు విచ్చేసే భక్తులకు వసతులు లేక సామూహిక స్నానాలు, బహిరంగ మల విసర్జన లకే పరిమితం అయి ఆడబిడ్డలు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో స్వర్ణాల చెరువు వద్ద 120 టాయిలెట్స్ తో పాటు సుందరమైన ఘాట్ ను టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించామని గర్వం గా చెప్పుకుంటున్నామ‌న్నారు.

10 కోట్ల తో ఇస్లామిక్ కన్వెన్షన్ సెంటర్ కు శంఖుస్థాపన చేసి 2 కోట్ల రూపాయలతో పిల్లర్లు నిర్మిస్తే అనంతరం అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 30 లక్షల రూపాయలతో పిట్టగోడ కట్టి డ్రామా లకు తెర తీస్తున్నారన్నారు.

ఎక్కడా లేని విధంగా మైనారిటీ ఆడబిడ్డల కు జూనియర్ కాలేజ్ ను టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశామ‌న్నారు. సామాన్యులను రక్షించాల్సిన పోలీసులు భక్షించే వారికి రక్షణ గా ఉంటున్నారని తెలిపారు. ముస్లిం మైనారిటీ లకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేదాకా ముస్లిం లు అంతా ఏకమై సమరభేరి మోగిస్తూనే ఉంటామ‌న్నారు.

మాజీ రాష్ట్ర పోలీసు కార్పొరేషన్ చైర్మన్ నాగూల్ మీరా మాట్లాడుతూ, జ‌నాభా లో 12 శాతం ఉన్న ముస్లిం లకు కేటాయిస్తున్న ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ? ముస్లిం లకు రాజకీయంగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

దళితుల కన్నా ఎక్కువ వెనుక బడిన జాతి ఏదైనా ఉంది అంటే అది ముస్లిం జాతి మాత్రమే అన్నారు. అజీజ్ ని ఎమ్మెల్యే గా గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ముస్లిం పై ఉందన్నారు. మైనారిటీ హక్కుల కోసం, రాజకీయ అవకాశాల కోసం ముస్లిం లు గళం విప్పాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

వైసిపి ఓటేసిన ముస్లిం లకు ఏం కృతజ్ఞత చూపావు జగన్ మోహన్ రెడ్డి అని ప్ర‌శ్నించారు. ముస్లిం ల అభివృద్ది కోసం మైనారిటీ కార్పొరేషన్ ను మొట్ట మొదటి సారి ఏర్పాటు చేసిన ఘనత ఎన్ టి ఆర్ గారిదే…. వేలాది కోట్ల రూపాయలను మైనారిటీ కార్పొరేషన్ కు కేటాయించి అట్టడుగున ఉన్న ముస్లిం సోదరులకు అండగా నిలిచారు చంద్రబాబు నాయుడు … ముస్లిం ఓట్ల తో అధికారం లోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మైనారిటీ కార్పొరేషన్ కు కేటాయించింది ఒక కుర్చీ, ఒక టేబుల్, ఒక ఫ్యాన్ మాత్రమేన‌ని అన్నారు. మైనారిటీలు రాజకీయం గా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు మౌలానా ముస్తాఖ్ అహ్మద్ ,మాట్లాడుతూ, వైసీపీ ఆదేశాల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ నేత కుమార్తె ను టాపర్ ను చేసేందుకు ముస్లిం ఆడబిడ్డ మిస్బా ను బలి తీసుకున్నారని తెలిపారు. మిస్బా కు జరిగిన అన్యాయం పై ఒక్క వైసీపీ మైనారిటీ నేత అయినా ప్రశ్నించారా ?

వైసీపీ లో ఉండే మైనారిటీ నేతలు గడ్డి పీకుతున్నారా అని ప్ర‌శ్నించారు. మైనారిటీ లను నమ్మించి మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డి ను జగన్ మోసపు రెడ్డి గా పిలుచుకోవాలన్నారు. మైనారిటీ ఆడబిడ్డల పై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్ర‌శ్నించారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం సర్వం నాశనం అయిపోయింది….

తిరిగి చంద్రబాబు వస్తేనే మైనారిటీ లకు న్యాయం జరుగుతుందన్నారు. దుల్హన్ పథకం, మైనారిటీ కార్పొరేషన్ నిధులు, మైనారిటీ విద్యార్థుల ఉన్నత విదేశీ విద్య కు నిధులు, రంజాన్ తోఫాని ఆపి వేశార‌న్నారు.

మాజీ మంత్రి యం.డి ఫరూఖ్ మాట్లాడుతూ, రాష్ట్రం లో ముస్లిం లు పూర్తిగా వెనుకబడి ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీ లు అన్ని విధాలా నష్టపోయారన్నారు. రాష్ట్రం లో ఉండే ముస్లిం లలో మూడు పూటలా కడుపు నిండని వారు 60 శాతం కి పైగా నే ఉన్నారన్నారు.

ముస్లింలు గడుపుతున్న దుర్భర జీవితాలను చూసి చలించిపోయిన నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మైనారిటీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఆదుకున్నారు. మైనారిటీ లకు గృహాలను కట్టించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని విమ‌ర్శించారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రికుల ప్రయాణ ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం అన్నారు. ముస్లిం లకు ప్రత్యేక రిజర్వేషన్ లు ఇవ్వడానికి నాటి టీడీపీ ప్రభుత్వం కసరత్తు చేసింది….

అనంతరం ప్రభుత్వ మార్పుతో తెలుగుదేశం పార్టీ కి ఆ అవకాశం లభించలేదన్నారు. పేద ముస్లిం బాల బాలికలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

నేడు రాష్ట్రం లో ముస్లిం లకు అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క ముస్లిం కూడా వైసిపి నేతలను నిలదీయలేక పోతున్నారన్నారు. ముస్లిం లకు టిడిపి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ది పట్ల వారిలో చైతన్యం కల్పించడం మనం పూర్తిగా విఫలం అయ్యామ‌ని తెలిపారు.

ముస్లిం లకు చెందాల్సిన నిధులను, బడ్జెట్ కేటాయింపులను నవరత్నాలకు మళ్లించి ముస్లిం లకు జగన్ మోహన్ రెడ్డి తీరని ద్రోహం తల పెట్టార‌న్నారు. వైసీపీ నేతల గురించి మాట్లాడాలన్న అసహ్యం వేస్తోందని, రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ వర్గాల తో పోల్చితే ముస్లిం లు దారుణం గా వెనుకబడి ఉన్నారని తెలిపారు.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!