స్టడీ సర్కిల్ లను ఏర్పాటు చేయండి
నెల్లూరు జిల్లా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు యశ్వంత్ సింగ్
నెల్లూరు విద్య, మార్చి 22 (సదా మీకోసం) :
ప్రభుత్వ ఉద్యోగుల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్ యువతకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్, ఇతర ఏర్పాటు గురించి, గడిచిన రెండేళ్లుగా ఉద్యోగాల నియామకాలకు కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటన, జాబ్ క్యాలెండర్ తూతూ మంత్రంగా వదిలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ల గురించి నెల్లూరు జిల్లా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ మాట్లాడారు.
గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి సమస్యతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ యువకులు పోటీ పరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే పరిస్థితి లేదన్నారు. యువత కోసం ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి కోచింగ్ ఉచితంగా ఇవ్వాలని నెల్లూరు జిల్లా భారతీయ జనతా యువమోర్చా తరఫున డిమాండ్ చేశారు.
మారు మూల గ్రామాల్లో నుండి శిక్షణ కొరకు జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వైపు నుండి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మంది యువతకు ఉద్యోగాలు సాధించేందుకు దోహదపడాలని కోరారు.
పోటీ పరీక్షల నోటిఫికేషన్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో తమ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఫీజులు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రతి జిల్లాలో నియోజకవర్గ కేంద్రాల్లో గ్రంథాలయ ఏర్పాటుతో పాటు నిరుద్యోగ యువత అవసరమైన కోచింగ్ మెటీరియల్ ఉచితంగా అందించాలని, ప్రభుత్వం ఇచ్చే శిక్షణ కేంద్రంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ కోచింగ్ ఇచ్చే విధంగా నైపుణ్యం కలిగిన వారిని నియమించాలని కోరారు.
కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి కుమార్, యువ మోర్చా నాయకులు భానుప్రకాష్, కమలేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.