అగ్రహీరోల సినిమా బ్లాక్ మార్కెట్ దందాపై యశ్వంత్ సింగ్ ఆగ్రహం

0
Spread the love

అగ్రహీరోల సినిమా బ్లాక్ మార్కెట్ దందాపై నెల్లూరు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ ఆగ్రహం.

-: నెల్లూరు న‌గ‌రం, మార్చి 27 (స‌దా మీకోసం) :-

నగరంలో అగ్రహీరోల సినిమా టికెట్లు బ్లాక్ మార్కెట్ లో అధిక రేట్లు విక్రయించడం పై జిల్లా బిజెపి అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ ఆధ్వర్యంలో స్థానిక పొగతోట మాగుంట థియేటర్ లోపల భారీ ఎత్తున నిరసన చేసి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

ఈ థియేటర్ల యాజమాన్యం మరియు అభిమాన సంఘాలు కలిసి స్థానిక ప్రేక్షకులకి టికెట్ ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ దందాకు టికెట్లు మళ్ళించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రేక్షకులకు టికెట్ లేకుండా బ్లాక్ చేసి థియేటర్ యాజమాన్యమే నేరుగా అభిమాన సంఘాల తో, బ్లాక్ టికెట్ కలిసి అధిక ధరలకు సామాన్య ప్రేక్షకులకు టికెట్లు విక్రయించడం పై థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

మల్టీప్లెక్స్ థియేటర్ లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధిక పార్కింగ్ వసూలు చేయడంపై, థియేటర్ పక్కన ప్రభుత్వ స్థలాన్ని చట్ట వ్యతిరేకంగా ఆక్రమించి వాణిజ్య ప్రకటనలకు లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అన్నారు.

అధిక రేట్లు తిను బండారాలు అమ్మకాలపై ఆయన ప్రశ్నించారు .వీరికి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు మద్దతుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై ఆయన వాళ్ళని సిగ్గుచేటని విమర్శించారు.
ఈ తీటర్ యాజమాన్యంపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రేక్షకులకు న్యాయం చేయని పక్షంలో దశలవారీగా ఈ బ్లాక్ మార్కెట్ దందాపై ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

థియేటర్ యాజమాన్యం ఫిర్యాదుపై స్థానిక చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు, సిబ్బంది విచ్చేశారు.

మాగుంట సినీ యాజమాన్యం వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే థియేటర్ వ్యవస్థాపకుడైన రాఘవరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి లా బొమ్మలు హాల్ లోపల దగ్ధం చేస్తానని హెచ్చరించారు.

కార్యక్రమంలో పెనుబల్లి జెడ్ పి టి సి వి.నారాయణ, BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అశోక్,ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, సాయి, bjym బీవీ నగర్ ప్రెసిడెంట్ నవీన్, బుచి మండల BJYM president పెంచల్ కృష్ణ, ముఖేష్, వెంకటేష్ ,వంశీ,అల్లూరు మండలం అధ్యక్షులు శీను, ఉపాధ్యక్షుడు సాయికృష్ణ,జిల్లా కార్యవర్గ సభ్యుడు సాయి కుమార్, సుభాష్, భాను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!