గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న
ఇందుకూరుపేట: అక్టోబరు 02 (సదా మీకోసం)
మండలంలోని డేవిస్ పేట గ్రామాన ఈ రోజు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా తొలుత డేవిస్ పేట సచివాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం డేవిస్ పేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటి వద్ద వివరిస్తూ, గ్రామస్తులను పలకరిస్తూ తిరిగారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ మండలాధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ కుమార్ యాదవ్, వైసీపీ నాయకులు గునుపాటి సురేష్ రెడ్డి, స్థానిక పంచాయతీ వైసిపి నాయకులు నెల్లూరు వెంకటరమణయ్య, మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.