నెల్లూరులో ఘ‌నంగా భ‌గ‌త్ సింగ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు

0
Spread the love

నెల్లూరులో ఘ‌నంగా భ‌గ‌త్ సింగ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు

నెల్లూరు ప్ర‌తినిధి, మార్చి 23 (స‌దా మీకోసం) :

బ్రిటిష్ సామ్రాజ్య‌వాదానికి వ్య‌తిరేకంగా, దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కిన భ‌గ‌త్ సింగ్‌, రాజ్ గురు సుఖ దేవుల 91వ వ‌ర్ధ‌తి కార్య‌క్ర‌మాలు నెల్లూరులో ఘ‌నంగా జ‌రిగాయి.

నెల్లూరు రూరల్ డై క్రాస్ రోడ్డు సెంటర్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ దేవుల 91 వర్ధంతి సభ ఎస్కే.  హఫీజ్ అధ్యక్షతన జరిగినది.

భగత్ సింగ్ గారి చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖదేవ్ గార్లు బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం ఉరికంబం ఎక్కి ఉరితాడు ముద్దాడి అమరులైన విప్లవ వీరులని తెలిపారు.

వారి ఆశయాలను నేటి పాలకులు నీరుగారుస్తున్నారని విమ‌ర్శించారు.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేలను ,విమానాశ్రయాలను, పోర్టులను, బొగ్గు గనులను, ఎల్ఐసి ,బిఎస్ఎన్ఎల్ కృష్ణపట్నం పోర్టు ,విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ , నేలటూరు విద్యుత్ ధర్మల్ స్టేషన్స్టేషన్ తదితర ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాలని భగత్సింగ్ ఆశయాలను నెరవేర్చాలని మాదాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

నెల్లూరు సిపిఎం రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ లుదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు.

కానీ దేశ ప్రజలందరికీ విద్య వైద్యం ఉపాధి భద్రత దేశ ప్రజలకు కరువైనాయన్నారు. మరో స్వతంత్ర పోరాటం భగత్ సింగ్, రాజ్ గురు ,సుఖదేవ్ గా ర్ల్ స్ఫూర్తి తీసుకొని యువతీ యువకులుపనిచేయాలని కోరారు.

కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎస్ కె ఖలీల్, ఎస్ కె శంషాద్, శాఖా కార్యదర్శులు కామ్రేడ్ పి ప్రసాద్ ,sk హఫీజ్, ఏ రాజేశ్వరమ్మ ,డివైఎఫ్ఐ నాయకులు ,ఆటో యూనియన్ కార్యదర్శి ఎస్ కె షాన్ వాజ్ ,ఆటో యూనియన్ నాయకులు ఎస్ రియాజ్, అనీఫ్ , హయాత్ బాబు,మురళి ,సంధాని తదితర నాయకులు భగత్ సింగ్ ,రాజ్ గురు ,సుఖదేవ్ వర్ధంతి సభలో పాల్గొన్నారు.

17వ డివిజ‌న్ లో

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల 91వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ పరిధిలోని17 వ డివిజన్ అపోలో సెంటర్ వద్ద. డివైఎఫ్ఐ, సి ఐ టి యు, పవర్ ఆఫ్ యూత్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగినది.

20,21 డివిజ‌న్ ల‌లో

నెల్లూరు రూరల్ 20,21 వ డివిజన్ల లోఉమ్మారెడ్డి గుంట సెంటర్ నందు, కొండాయపాలెం హరిజనవాడ అరుగు సెంటర్ నందు రెండు ప్రాంతాలలో, డివైఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవుల 91 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు.

అనంతరం డివైఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేసి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు, డబ్బు గుంట శ్రీనివాసులు, దేవతటీ సతీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం… అందరికీ విద్య ఉపాధి ఉద్యమిద్దాం అని పిలుపునిచ్చారు.

భగత్ సింగ్ ,రాజ్ గురు,సుఖదేవు,91 వ వర్ధంతి సందర్భంగా కాగడాల ప్రదర్శన

భగత్‌సింగ్‌ త్యాగం వృథా కానీయం : డివైఎఫ్ఐ

భగత్ సింగ్, రాజ్ గురు ,సుఖదేవు ,91వ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి వి.ర్. సి సెంటర్ వరకు ఖాగడల ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యు. ప్రసాద్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ విప్లవానికి మారు పేరు భగత్‌సింగ్‌ పోరాటాలకు నిలువెత్తు నిదర్శనమని స్వాతంత్య్ర పోరాటంలో యువ రక్తంతో దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగశీలి నేటి యువతకు ఆదర్శప్రాయుడని ఇటువంటి విప్లవనేత వర్ధంతిని పురస్కరించుకుని పాలకుల వినాశకర విధానాలపై గళం విప్పేందుకు యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు.

1907 సెప్టెంబర్‌ 27న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా ప్రాంతంలో భగత్‌సింగ్‌ జన్మించారని, సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదంతో స్వాతంత్య్ర పోరాటానికే వన్నెతెచ్చారని తెలిపారు.

తన 13వ ఏటనే గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి ప్రభావితుడయ్యారని, 1929లో బ్రిటీష్‌ అసెంబ్లీలో పొగబాంబు విసిరిన సంఘటనలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేశ్‌లు బ్రిటీష్‌ పాలకులనే గడగడలాడించారని తెలిపారు.

ఈ పోరాటంలో విప్లవం వర్థిల్లాలి, శ్రామికవర్గం వర్థిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి, సోషలిజం వర్థిల్లాలనే ఉత్తేజింపజేసే నినాదాలను కూడా రూపొందించారన్నారు.

23 ఏళ్ల వయస్సుకే 1931 మార్చి 23న ఉరికంబమెక్కి దేశానికే ఆదర్శప్రాయుడయ్యాడని, ఆయన మరణం వృథా కాలేదన్నారు.

అనంతరం ఎందరో యువకిశోరాలు స్వాతంత్య్ర పోరాటంలోకి వచ్చి ఉద్యమించారని,
భగత్‌సింగ్‌ వంటి మహోన్నత ఆదర్శప్రాయుడి స్ఫూర్తితో ప్రస్తుత మతోన్మాద పాలకుల చర్యలను, ప్రపంచబ్యాంకు విధానాలు నెత్తినెక్కించుకున్న నేతల తలరాతలను మార్చాల్సింది కూడా భగత్‌సింగ్‌ వారసులుగా నేటి యువతరమే అని అన్నారు.

కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర కార్యదర్శి బి. పి నరసింహ .ఎస్కె ఫయాజ్ .కృష్ణ జి .నాగరాజు. శివ కుమార్ .బాబు .బాలు .పెద్ద. సుబ్బరాయుడు. తదితరులు పాల్గొన్నారు.

విప్లవకెరటం భగత్ సింగ్ కు నివాళ్ళు : ఎస్‌.ఎఫ్‌.ఐ.

 

కామ్రేడ్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలో క్లాక్ టవర్ వద్ద యువ విప్లవకారుడైన భగత్ సింగ్ కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఎఫ్‌.ఐ. రూరల్ కార్యదర్శి వై.కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ భారత దేశ స్వాతంత్రం కోసం 23 సంవత్సరాల వయసులో ఉరికంభాన్ని ఎగతాళి చేసి మేము జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం, మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని సైతం ఎగతాళి చేస్తాం, కత్తుల వంతెన మీద కవాతు చేస్తామ‌ని తెలిపారు.

నిప్పురవ్వల మీద నిదురిస్తాం, అంటూ గర్వంగా దేశ భవిషత్తు, స్వాతంత్రం కోసం వారి ప్రాణాలను అర్పించారన్నారు..

వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్లే కర్తవ్యం భారతదేశంలో ప్రతి ఒక్కరు మీద ఉద‌ని అన్నారు.

ఎస్‌.ఎఫ్‌.ఐ. రూరల్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ మనం అందరం భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి.

అలాగే ఆయన చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని, దేశ భవిష్యత్తు కోసం కృషి చేద్దాం అని అన్నారు.

కార్యక్రమంలో రూరల్ ఉపాధ్యక్షురాలు జి. వైష్ణవి, సుకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!