జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం
నెల్లూరు టౌన్ పరిధిలోని టిడ్కో గృహాల్లో కార్డన్ సర్చ్
జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్
నెల్లూరు క్రైం, ఏప్రిల్ 22 (సదా మీకోసం) :
సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి నెల్లూరు టౌన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
టౌన్ డిఎస్పీ సింధు ప్రియ ఆద్వర్యంలో 3 సిఐలు, 4 ఎస్సైలు, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 90 మందితో సుమారు 100 ఇళ్ళు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా టౌన్ డిఎస్పీ సింధు ప్రియ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ .(అడ్మిన్) సి.హెచ్. సౌజన్య సూచనల మేరకు కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు చెప్పారు.
సరైన పత్రాలు లేని 54 బైకులు, 4 ఆటోలు, 2 కార్లు స్వాధీనం, వేలిముద్రల సేకరణ ద్వారా నలుగురు పాత నేరస్థులు గుర్తించినట్లు తెలిపారు.
నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీసు శాఖ నిర్వహించే కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజలు వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ, శాంతి భద్రతలను పరిరక్షణ, అసాంఘీక శక్తుల ఏరివేతే లక్ష్యం.అని తెలిపారు.
ప్రత్యేక కార్యాచరణ ద్వారా జిల్లాలో హింసాత్మక చర్యలు అరికట్టుటకు ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రకటించారు.
జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల నిర్మూలనకు కఠిన ఆదేశాలు.. అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు నమోదు చేస్తాం అని తెలిపారు.
ఈ శోధన ముఖ్య ఉద్దేశ్యం పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం, వెండి, బంగారు వంటి చోరీ సొత్తు, అనుమానంగా ఉన్న రికార్డులు లేని అన్నీ వస్తువులు, వాహనాలు, అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు వాటివి గుర్తించి స్వాధీన పరుచుకోవడం అని అన్నారు.
భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో హౌసెస్ ప్రతి ఇంటిని నెల్లూరు పోలీసులు క్షుణ్ణంగా శోధించారు.
చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్ధానిక పోలీసులకు లేదా డయల్ 112/100 కు తెలియజేయాలని కోరారు.



