పరదాల చాటున తిరిగిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలెలా తెలుస్తాయ్ : ఎమ్మెల్యే సోమిరెడ్డి
పరదాల చాటున తిరిగిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలెలా తెలుస్తాయ్
కష్టకాలంలో చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలో ఉండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది
ఊహించని విపత్తుతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజల వద్దకెళ్లి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకరం
లక్షల కోట్లు ప్రజల సొత్తును దోచేసిన జగన్మోహన్ రెడ్డి విరాళంగా రూ.కోటి మాత్రమే ఇవ్వడం బాధాకరం
ఎన్ని వేషాలు వేసినా దోచుకున్న ప్రజాసొత్తు ప్రతి రూపాయినీ కక్కిస్తాం
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉదారంగా స్పందించాలి
సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు ప్రతినిధి, సెప్టెంబర్ 4 (సదా మీకోసం) :
నెల్లూరులో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఎప్సుడూ చూడని డిజాస్టర్ అని అన్నారు. “సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. వరదలు సంభవించిన మరుక్షణం నుంచే సహాయక చర్యల్లో నిమగ్నమవడం గతంలో ఎప్పుడూ చూడలేదు. సీఎం చంద్రబాబు నాయుడు పడవలు, జేసీబీలో తిరుగుతూ వరద బాధితులతో మాట్లాడటంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేయడం గతంలో ఎప్పుడైనా చూశామా. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏనాడైనా సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లాడా..జనం మధ్యలో ఎప్పుడైనా తిరిగాడా. వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. జగన్మోహన్ రెడ్డి మొదట తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సొత్తును లక్ష కోట్లు దోచేశాడు. ఆ తర్వాత ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి లెక్కకు మించి సంపాదించాడు. ఈ రోజు దేశంలో అత్యంత ధనిక రాజకీయ నాయకులుగా రూ.5 లక్షల కోట్లతో శరద్ పవార్ కుటుంబం ఉంటే..రూ.3.5 లక్షల కోట్లతో మన జగనన్న రెండో స్థానంలో ఉన్నారు. ఈ రెండు కుటుంబాల ఆస్తులు కలిపితే అదానీ, అంబానీల కంటే టాప్ లిస్టులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రూ.43 వేల కోట్లు అక్రమంగా ఆర్జించాడని సీబీఐ ఎప్పుడో చార్జిషీటు ఫైల్ చేసింది. ఈ రోజు ఆ ఆస్తుల విలువ ఎంత. జనం సొమ్ముతో ఇంత కోటీశ్వరుడిగా అవతారమెత్తిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వారు కష్టాల్లో ఉంటే సాయం రూ.కోటితో సరిపెట్టడం దురదృష్టకరం. దోపిడీ చేసిన సొత్తులో ఒక్క శాతం మొత్తం ఇచ్చినా ప్రజల కష్టాలు కొంతమేరైనా తీరిపోతాయి. బుడమేరు వరదకు చంద్రబాబు నాయుడు కారణమని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. కృష్ణానదిలో 11.50 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే..అక్కడికెళ్లి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకరం. వరదలు వచ్చిన మూడో రోజుకి చంద్రబాబు నాయుడు జనంలోకి వచ్చారని అబద్ధాలు చెప్పడానికి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సిగ్గుందా. ఆగస్టు 31న వరద ప్రారంభమైతే సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలో ఉన్నారు. రైలులో హైదరాబాద్ వెళుతూ వరదల్లో చిక్కుకుంటే..నేను సంపాదించిన సంచులను తుమ్మల నాగేశ్వరరావు దాటించాడని కాకాణి కూస్తాడు. తోడేరు పక్కనే ఉండే మరుపూరులో కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారుల సంతకాలు లేకుండా బంధువుల పేర్లకు దారాధత్తం చేస్తుంటే ఊరుకోవాలా. భూఅక్రమాలపై విచారణలో భాగంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఒకరి ఇంటికి పోతే నగలు దొంగతనం చేశారని చెప్పడానికి నోరెలా వచ్చింది. ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి రెవెన్యూ, పోలీసు అధికారులను దొంగలని మాట్లాడటం దురదృష్టకరం. రోజుకు రెండు సార్లు నన్ను, రోజు మార్చి రోజు చంద్రబాబు నాయుడిని తిడితే చేసిన పాపాలు పోతాయనుకుంటున్నాడోమో.. ఏదీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్ని వేషాలు వేసినా దోచుకున్న ప్రజాసొత్తు ప్రతి రూపాయినీ కక్కిస్తాం.ప్రస్తుత ప్రజలు కష్టాల్లో ఉన్నారనే విషయమైనా గ్రహించి రాజకీయాలను పక్కన పెట్టాలని వారికి హితవు పలుకుతున్నాం. వరద బాధితులను ఆదుకునేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు స్పందించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. అందరూ ఉదారంగా స్పందించి ప్రభుత్వానికి విరాళాలు అందజేయాలని పిలుపునిస్తున్నాం” అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.