30వ డివిజన్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట
30వ డివిజన్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట
నేటితో 65 రోజులు, 5019 మంది కార్యకర్తలను కలసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు రూరల్, మార్చి 1 (సదా మీకోసం) :
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహించిన జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్యక్రమం నేడు 30వ డివిజన్, రామచంద్రా రెడ్డి నగర్‌లో వందలాదిమంది కార్యకర్తలతో కోలాహలంగా, నిడారంబరంగా ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఏపార్టీకైనా, ఏ నాయకుడికైనా కార్యకర్తలు, ప్రజలు రెండు కళ్ళలాంటివారని, కార్యకర్తల కళ్ళలో వెలుగులు ఉంటే, కార్యకర్తల కుటుంబం సంతోషంగా ఉంటే, ఆ నాయకుడు పది కాలాలపాటు ప్రజా జీవితంలో కొనసాగుతారన్నారు.
65 రోజులలో 5019 మంది కార్యకర్తల ఇళ్ళకి, పార్టీ నాయకులైన 1072 మంది కార్యకర్తల పరిస్థితి అత్యంత ధారుణంగా ఉందని, అందుకే అందులో 400 మంది కార్యకర్తల కుటుంబాల పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటున్నానని, వాళ్ళు చదివినంతకాలం ఆ కార్యకర్తల కుటుంబాల నెత్తిన భారం పడకుండా ఆ భారాన్ని తన నెత్తిన వేసుకుంటున్నానని ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. మరో 672 మంది కార్యకర్తల కుటుంబాల ఎదుగుదల కోసం తన వంతుసహకారం అందించానని తెలిపారు.
అధికార పార్టీ శాసనసభ్యుడిగా అన్నిరకాల ప్రయత్నాలు చేసి ప్రజలకి, నాకు వారధిలా నిలుస్తున్న కార్యకర్తల సంక్షేమం కోసం రాజకీయ గౌరవం కోసం, నావంతు కృషి చేస్తానన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఇద్దరు బిడ్డలు ఐ.ఏ.యస్. చదవాలని కోరగా వారి కోచింగ్ కూడా పూర్తి బాధ్యత తాను తీసుకుంటున్నానని, ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల సాధన, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేత, కార్యకర్తల సంక్షేమంతో ముందుకు సాగుతామని తెలిపారు. కష్టకాలంలో తనతోకలసి పనిచేసిన ప్రతి కార్యకర్తకి, పార్టీ నాయకులకి రాజకీయంగా గుర్తింపునిచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
ముగింపు కార్యక్రమంలో నగర మేయర్ పోట్లూరి స్రవంతి జయవర్దన్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయడైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు, మాజీ మేయర్ భానుశ్రీ, 30వ డివిజన్ కార్పోరేటర్ కూకాటి ప్రసాద్, డివిజన్ కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్లు, వైసీపీ సీనియర్ నాయకులు మరియు వందలాది మంది పార్టీ కార్యకర్తలు హాజరై ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.