జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి…. మంత్రి కాకాణిని కోరిన ఏపీఈజేయూ

0
Spread the love

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

మంత్రి కాకాణిని కోరిన ఏపీఈజేయూ

నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల‌ను ప‌రిష్క‌రించాల‌ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ని ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీఈజేయూ) APEJU  రాష్ట్ర కో క‌న్వీన‌ర్ గ‌ట్టుప‌ల్లి శివ‌కుమార్ సూచ‌న మేర‌కు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఉడ‌తా రామ‌కృష్ణ‌, ప్రధాన కార్యదర్శి పిగిలం నాగేంద్ర యాదవ్ ల నేతృత్వంలో నెల్లూరు రూరల్ పరిధిలోని స్థానిక అనిల్ గార్డెన్స్ లో జ‌రిగిన మిట్‌ది ప్రెస్ కార్య‌క్ర‌మ‌లో కోరారు. జిల్లాలో ఎడిటర్లు , జర్నలిస్టులు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళారు.

స్థానిక ప‌త్రిక‌ల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాలి

రాష్ట్ర కో-కన్వీనర్ గ‌ట్టుప‌ల్లి శివ‌కుమార్‌, రాష్ట్ర నాయ‌కులు ఉడతా శరత్ యాదవ్ లు

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కో-కన్వీనర్ గ‌ట్టుప‌ల్లి శివ‌కుమార్‌, రాష్ట్ర నాయ‌కులు ఉడతా శరత్ యాదవ్ లు మాట్లాడుతూ స్థానిక పత్రికలకు ప్రతినెలా ప్రభుత్వం తరుపున 10 వేల రూపాయలు ప్రకటనల రూపంలో ఇవ్వాలని, పెద్ద పత్రికలకు ఇచ్చే ప్రకటనలలో 30 % స్థానిక పత్రికలకు ఇవ్వాలని, ఎడిటర్లు , జర్నలిస్టుల పిల్లలకు ఉ చితంగా విద్య, వైద్య వసతులు కల్పించాలని కోరారు.

ఇంటి నివేశ‌న స్థ‌లం కేటాయించి, ఇంటిని నిర్మించి ఇవ్వాలి

జిల్లా అధ్య‌క్షులు ఉడ‌తా రామ‌కృష్ణ

నెల్లూరు జిల్లా అధ్య‌క్షులు ఉడ‌తా రామ‌కృష్ణ మాట్లాడుతూ అక్రిడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఇంటి నివేశన స్థలం కేటాయించి, ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని, అలాగే కరోనా కష్టకాలంలో జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి చితికిపోయి ఉన్నందున హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి హెల్త్ కార్డులు రెన్యువల్ చేయాలని పేర్కొన్నారు.

అంతేకాకుండా జర్నలిస్టులకు ఆపత్కాలంలో ఆదుకునే ఆక్సిడెంట్ పాలసీ గత 3 సంవత్సరాలుగా పునరుద్ధరణకు నోచుకోకపోవడం విచారకరమని కావున వెంటనే ఆక్సిడెంట్ పాలసీని పునరుద్దరించి దానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని తెలియచేశారు.

అర్హులైన ఎడిట‌ర్ల‌కు పెన్ష‌న్ మంజూరు చేయాలి

పిగిలం నాగేంద్ర యాద‌వ్

యూనియ‌న్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పిగిలం నాగేంద్ర యాద‌వ్ మాట్లాడుతూ, అర్హత కలిగిన, 50 సంవత్సరాలు నిండిన ఎడిటర్లకు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని, అర్హత కలిగిన జర్నలిస్టులకు నిభందనలతో సంబంధం లేకుండా తెల్ల రేషన్ కార్డులు ( బియ్యం కార్డులు మంజూరు చేయాలని కోరారు.

ఇత‌ర నాయ‌కులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జుగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అసోసియేషన్ గా ఉన్న మేము, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ & జర్నలిస్ట్స్ అసోసియేషన్ ( ఎపిఈజెఏ ) APEJA నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులం కలసి వినతి పత్రం అందించి ఉన్నామ‌ని తెలిపారు.

జగన్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు జర్నలిస్టుల సమస్యలపై స్పందించకపోవడంతో జర్నలిస్టులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి గోవర్ధన్ రెడ్డి దృష్టికి జిల్లా నాయకుల ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరిగిందని దీనిపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స‌మ‌స్య‌ల‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తాన‌ని తెలిపారు.

కార్యక్రమంలో ఏపీఈజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.జె. రమేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు సరళమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!