రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

0
Spread the love

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు భరోసా కేంద్రాలతో రైతులకు వివిధ ప్రయోజనాలు

జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు, జూలై 8 (స‌దా మీకోసం) :

నెల్లూరు: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే రైతులకు అవసరమైన సలహాలు సూచనలతో పాటు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులను సబ్సిడీ పై అందచేసే వినూత్నమైన వ్యవస్థను తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం నెల్లూరులోని వ్యవసాయ పరిశోధన స్థానం నందు ఏర్పాటుచేసిన రైతు దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొని, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా వుంటూ, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, వ్యవసాయ, దాని అనుబంధాల రంగాలకు చెందిన సిబ్బందిని నియమించడంతో పాటు రైతులకు అందుబాటులో వుండి రైతులకు అవసరమైన సలహాలు సూచనలతో పాటు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులను సబ్సిడీ పై అందచేసే వినూత్నమైన వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు.

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు.

గ్రామాల్లో ఎన్నో ఏళ్ల నుండి రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పధకాన్ని ప్రవేశపెట్టి సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఖచ్చితమైన భూమి హద్దులు, కొలతలతో పాటు యాజమాన్య హక్కులు కల్పించేలా భూ రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

జిల్లాలో 57 గ్రామాల్లో పూర్తి స్థాయిలో భూ రీ సర్వే కార్యక్రమం పూర్తి కావడం జరిగిందని, జిల్లా మొత్తం భూ రీ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసి రైతులకు కొత్త భూ హక్కు పత్రాలను అందించడం జరుగుతుందన్నారు.

రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పధకం ద్వారా రైతులకు సాగు పెట్టుబడి సాయం కింద జిల్లాలో 2.25 లక్షల మంది రైతులకు రెండు విడతల్లో రైతు భరోసా అందించడం జరిగిందన్నారు.

అలాగే రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్, సబ్సిడీ పై ఎరువులు, విత్తనాలు,పురుగు మందులు అందించడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల వలన రైతు నష్టపోతే ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెల్పడం జరిగింది.

పరిశోధన శాలల్లో జరిగే పరిశోధనా పలితాలపై రైతులకు అవగాహన కల్పించి వాటిని రైతులకు సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ అధికారులపై వుందన్నారు.

రైతులు పండించిన పంటను నిల్వ చేసుకొని, గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి, పంటను నిలచేసుకోవడానికి జిల్లాలో 78 గోడౌన్లు మంజూరు కాగా, ఆ గోడౌన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో రైతాంగానికి అందుబాటులో వుంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహించడంతో పాటు ప్రత్యామ్యాయ పంటలను ప్రోత్సహించి రైతులు వినూత్న సాగు పద్దతులను పాటించి అధిక దిగుబదులు సాధించే దిశగా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

బ్యాంకులు కూడా రైతులకు అవసరమైన రుణాలు విరివిగా ఇవ్వడం జరుగుచున్నదని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రస్తుతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న సాగు పద్దతుల మార్పులు, రైతులు అనుసరించాల్సిన విధానాలపై రైతు సంఘాల ప్రతినిధులు కోటి రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రాజు, కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డా. సుమతి తదితరులు ప్రసంగించారు.

తొలుత రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవసాయ , ఉద్యాన శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ లు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు , మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వర రావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారావు, ఏ.పి.ఏం.ఐ.పి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు, నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ డా. యు. వినీత, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!