కమనీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం
కమనీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం
– : కోట – నెల్లూరుపల్లి కొత్తపాలెం, ఏప్రిల్ 4 (సదా మీకోసం) :-
కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ గూడూరు డివిజన్ కన్వీనర్ దీవి అనంతాచార్యులు శ్రీవైఖానస ఆగమోక్తంగా శ్రీనివాస కళ్యాణ విశేషాలను తెలియజేస్తూ శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు.
ఉభయకర్తలుగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు నేదురుమల్లి ప్రసేన్ కుమార్ రెడ్డి మైధిలి దంపతులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కళ్యాణ మహోత్సవంలో ఆలయ అర్చకులు చలపతి స్వామి , పెట్లూరు వేంకట నారాయణరావు, అనురాధ, గ్రామస్తులు ,మహిళలు పాల్గొన్నారు .విచ్చేసిన భక్తులకు తలంబ్రాక్షతలు, తీర్ధ ప్రసాదాలను పంచిపెట్టారు.