పామూరులో ఘనంగా హరికృష్ణ వర్ధంతి వేడుకలు

పామూరులో ఘనంగా హరికృష్ణ వర్ధంతి వేడుకలు
-: పామూరు, ఆగష్టు 29 (సదా మీకోసం) :-
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోఘనంగా హరికృష్ణ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ మూడవ వర్ధంతి వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పు వాడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్థానిక శేషమహల్ ఆవరణలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా నలుమూలలా పర్యటన చేసిన సందర్భంలో చైతన్య రథసారథిగా ఎన్నో లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి తండ్రి కి చేదోడు వాదోడుగా అన్ని తానై చూసుకుంటూ రాష్ట్రంలోని ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను అన్న హరికృష్ణ గా నిలబడ్డాడు, తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా రాష్ట్ర ప్రజలకు పార్టీకి విశేష సేవలు అందించి తనదైన ముద్ర వేసుకున్నారని తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ తెలుగుదేశం పార్టీ మరువ లేదని ఆయన ఆశయాల అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.