సొంత ఆదాయం కోసమే కల్తీమద్యం అమ్మిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి : సోమిరెడ్డి

0
Spread the love

సొంత ఆదాయం కోసమే కల్తీమద్యం అమ్మిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

  • ఏటా రూ.5 వేల కోట్ల సంపాదన కోసం అమాయకులను కల్తీ మద్యానికి బలి చేస్తున్నారు
  • ప్రభుత్వం విక్రయిస్తున్న స్లోపాయిజన్ (విషపూరిత మద్యం) కారణంగానే జంగారెడ్డి గూడెం లాంటి ఘటనలు
  • ఏపీలో విక్రయిస్తున్న నాసిరకం మద్యం మొత్తం వైసీపీ నేతల కంపెనీల్లో తయారవుతున్నదే
  • బహుశ జాతీయ కంపెనీలైతే తనకు లంచాలు ఇవ్వవనే ప్రముఖ బ్రాండ్లను ఏపీలోలోనే లేకుండా చేశారు
  • దశలవారీ మద్యపాన నిషేదం పేరుతో నాసిరకం విక్రయాలు పెంచుకుంటూ పోతూ వేల కోట్లు గడిస్తున్నారు
  • టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అమరావతి, మార్చి 18 (స‌దా మీకోసం) :

అమరావతిలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేఖ‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం స్లోపాయిజన్ (విషపూరితమైన మద్యం) అమ్మకాలు సాగిస్తోందని విమ‌ర్శించారు.

మెక్ డోవెల్, ఓల్డ్ మంక్, ఓల్డ్ టావ్రెన్, కింగ్ పిషర్, బడ్వయిజర్ వంటి బ్రాండ్లతో పాటు పలు మల్టీ నేషనల్ కంపెనీల మద్యాన్ని ఏపీలోనే లేకుండా చేసేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని ప్రొహిబిషన్ యాక్ట్ ను ఏపీలో అమలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి ఆ హక్కు ఎవరిచ్చారని ప్ర‌శ్నించారు.

కల్తీమద్యం, కల్తీసారా కారణంగానే ప్రజల ఆరోగ్యం దెబ్బతిని క్రమేణా మరణాల సంఖ్యపెరుగుతోందని, ఆ మరణాల్లో వెలుగులోకి వస్తున్నవి కొన్నేన‌ని వివ‌రించారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఊరూపేరూలేని కల్తీబ్లాండ్ల మద్యంఅమ్మకాలు పెరిగిపోయాయని, ప్రభుత్వమే నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో ఏటీఎం కార్డులు, పేటీఎమ్..గూగుల్ పే వంటి వాటిని అనుమతించడంలేదు.

కేవలం నగదుచెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. జంగారెడ్డిగూడెంలో మరణించిన 28మందే కాకుండా, రాష్ట్రంలో అమ్ముతున్న స్లోపాయిజన్ మద్యంవల్ల భవిష్యత్ లో ఇంకా ఎన్నో ఘోరాలుచూడాల్సి వస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో అమ్ముతున్న 5బ్రాండ్లను ఎంపీ రఘురామకృష్ణంరాజు టెస్టింగ్ కు పంపితే భయానక వాస్తవాలు బయటపడ్డాయని, ప్రభుత్వం అమ్ముతున్న మద్యంతాగితే మెదడువ్యవస్థ, నాడీ వ్యవస్థ దెబ్బతినడంతోపాటు, రోగ నిరోధకవ్యవస్థ పూర్తిగా పనికి రాకుండాపోతుందని, ఎస్ఏఎస్ డిస్టిలరీ కంపెనీ వారి గ్రీన్ ఛాయిస్, ఛాంపియన్ వంటిబ్రాండ్లలో ఉండే హానికరపదార్థాలతో శరీరంలో ఏఏ భాగాలు దెబ్బతిని, మద్యంతాగే వ్యక్తిపై ఎంత ప్రభావం పడుతుందో ఆ పరీక్షల్లో స్పష్టమైందని వివ‌రించారు.

బెంజోక్వినన్ అనే రసాయనం కారణంగా శరీరంలో దీర్ఘకాలిక విషలక్షణాలు ప్రబలుతాయని వాటివల్ల మనిషి త్వరగా మరణించే అవకాశముందని హెచ్చరించారు. ఛాంపియన్ బ్రాండులో ఫెరోగిలాల్ అనే హానికరపదార్థం ఉన్నట్లు కూడా పరీక్షల్లో తేలిందని, రాయల్ సింహా, సెలబ్రిటీ బ్రాండ్ల మద్యంలోనూ ప్రమాదకర రసా యనాలున్నాయని, వాటివల్ల మానవశరీరంలో తలెత్తే దుష్పరి ణమాలను తెలియచేశారు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఎస్ఎన్ జే కంపెనీ తయారుచేసే గ్రీన్ ఛాయిస్ మద్యం క్వార్టర్ బాటిల్ (180ఎమ్.ఎల్) ధర రూ.120లుగా ఉందని, ప్రభుత్వం ఆ బాటిల్ ను రూ.15కే కొంటోంది. 48 సీసాలను రూ.696కి కొనుగోలు చేసి రూ.5,760కి అమ్ముతోందని, ఆ విధంగా ఒక్కో బాక్స్ పై ఈప్రభుత్వానికి రూ.5,064ల వరకు లాభం వస్తోందని, ఇలా గ్రీన్ ఛాయిస్ బ్రాండ్ ఒక్కటేకాదు..

మలబార్ హౌస్, రాయల్ ప్యాలెస్ అనే బ్రాండ్ల నుకూడా రూ.6,63కి కొని రూ.7వేలవరకు అమ్ముతున్నారని వివ‌రించారు. అన్నిరకాల నాసిరకం మద్యాన్ని ఈప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా అధిక ధరలకు విక్రయిస్తోంది.

రూ.270లకు అమ్ము తున్న మద్యం సీసాపై రూ.200వరకు ఆదాయం ముఖ్యమంత్రికే పోతోందని, డిస్టిలరీ కంపెనీలనుంచి రూ. 15కి కొంటున్న మద్యంసీసాను రూ. 250 నుంచి రూ.270వరకు అమ్మడం ద్వారా లక్షలకోట్ల దోపిడీ జరుగుతోందని, నెలకు రూ.400 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ.5వేల కోట్ల వరకు ప్రభుత్వానికి అందుతుంటే, కల్తీమద్యం తాగి ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న మద్యం పేర్లు ఎక్కడైనా..ఎప్పుడైనా విన్నామా అని ప్ర‌శ్నించారు.

చివరికి మాన్షన్ హౌస్ బ్రాండ్ ను కూడా కల్తీచేసి, ఏపీలో లంచాలు కట్టడంకోసం సదరు కంపెనీ వారు వేరేవిధంగా తయారుచేసి అమ్ముతున్నారని, బయట రాష్ట్రాలు, దేశంలో లభించే మాన్షన్ హౌస్ బ్రాండ్ వేరు..ఏపీ లోఅమ్ముతున్న బ్రాండ్ వేరని, ఈ ప్రభుత్వానికి లంచాలు కట్టి, తమ ప్రతిష్టను ఎందుకు దెబ్బతీసుకోవాలన్న ఉద్దేశంతో మెక్ డోవెల్…కింగ్ ఫిషర్ లాంటి ఎంఎన్ సీ కంపెనీలు తమఅమ్మకాలను పూర్తిగా ఆపేశాయని, సింగరాయకొండలోని మెక్ డోవెల్ డిస్టిలరీ మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు.

నెల్లూరులోని ఎస్ఎన్ జే కంపెనీ వారు, గతంలో బీర్ లైసైన్స్ తీసుకొని, ఏవో ఒకటోరెండో మద్యంబ్రాండ్లు అమ్మేవారని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏకంగా 9బ్రాండ్ల ను మార్కెట్లోకి వదులుతున్నారని, అవన్నీకూడా పరమచెత్త బ్రాండ్లు అని తెలిపారు.

ప్రభుత్వానికి నాసిరకం మద్యం అమ్ముతూ, పాలకులకు కట్టాల్సిన సొమ్ముకడుతూ, ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని, ఏపీలో లంచాలు కట్టడానికే ఎస్ఎన్ జే కంపెనీ వారు నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని, సర్వేపల్లి ప్రాంతంలో తయారయ్యే నాసిరకం మద్యం తాగే వారంతా ఆసుపత్రిలో చేరుతున్నారని నెల్లూరులోని పొగతోట వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని,
ప్రభుత్వం మద్యం అమ్మకాల పేరుతో విషపూరితమైన పదార్థాలను ప్రజలశరీరాల్లోకి ఎక్కిస్తోందని వివ‌రించారు.

ఏపీలో అమ్ముతున్న మద్యంబ్రాండ్ల లో విషపూరితమైన పదార్ధాలు ఉన్నాయని తేలాక కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతేఎలా?….ఏటా వచ్చే రూ.5వేలకోట్ల ఆదాయంకోసం ప్రజల ప్రాణాలుతీసే హక్కు ఈప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో విక్రయిస్తున్న నాసిరకం మద్యం తయారుచేసే కంపెనీలన్నీ వైసీపీ వారివేన‌ని, రాయల్ ప్యాలెస్.. రాయల్ ఛాయిస్.. మలబార్ హౌస్,గ్రీన్ ఛాయిస్ బ్రాండ్లు తయారు చేస్తున్న ఎస్ ఎన్ జే కంపెనీ మొదలు రాయలసీమలో ఎంపీ మిథున్ రెడ్డి కంపెనీ, బొత్స సత్యనారాయణ డిస్టిలరీ కంపెనీల మద్యాన్ని అమ్ముతున్నారని, జంగారెడ్డిగూడెం ఘటన జరిగాక కేవలం 3, 4 రోజుల్లోనే లక్షల లీటర్ల కల్తీసారాను నేలపాలుచేశారని, ఆ పనిని ఈ ప్రభుత్వం ముందే చేసి ఉంటే అక్కడ 28 మంది చనిపోయేవారు కాదుగా అని ప్ర‌శ్నించారు. కల్తీ మద్యం అమ్మకాలు.. అవి తాగిన వారికి జరిగే నష్టానికి సంబంధించిన వివరాలు, సమాచారమంతా ఈప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలుసున‌ని, కేవలం డబ్బుకోసమే ప్రజల ప్రాణాలను నాసిరకం మద్యానికి బలిచేస్తున్నారని, ప్రజలతో కల్తీమద్యం , నాటుసారా తాగిస్తూ వారి ప్రాణాలు హరిస్తూ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో పాలకులే సమాధానం చెప్పాలని నిల‌దీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!