“స్పందన” కార్యక్రమంను నిర్వహించిన జిల్లా ఎస్పీ
“స్పందన” కార్యక్రమంను నిర్వహించిన జిల్లా ఎస్పీ
నెల్లూరు క్రైం, మార్చి 21 (సదా మీకోసం) :
జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ విజయరావు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజలు పాల్గొని తమ ఫిర్యాదులను, సమస్యలను వివరించారు. సమస్యలతో వచ్చిన ప్రజలతో వినయంగా, అంకిత భావం, సేవా దృక్పథం కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ సూచన చేశారు.
మహిళలను వేధించడం, ఇతర సమస్యలపై వెంటనే స్పందించాలని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదులను అత్యధిక ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.
మిస్సింగ్, దొంగతనాల కేసులలో బృందాలను ఏర్పాటు చేసి రికవరీపై ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించారు.
అనధికార చీటీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. భూ, సివిల్, కోర్టు పరిధిలోని వివాదాలలో న్యాయపరమైన సలహాలు పొంది మాత్రమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
మహిళలు, కుటుంబ సమస్యలలో ఓపిక, ఓర్పుగా వ్యవహరిస్తూ పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబాన్ని చక్కదిద్దేలా వ్యవహరించాలని సూచించారు.
నమోదు కాబడిన కేసులలో దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి, బాదితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సత్వరమే పరిష్కారం చూపాలని ఆదేశించారు.
కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేదింపులు, దొంగతం కేసులలో రికవరీ, భూ, ఆస్థి వివాదాలు, ఇతర సమస్యలు స్వీకరించారు.