గోరంట్ల మాధవ్ మన ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది : షేక్. అబ్దుల్ అజీజ్

0
Spread the love

గోరంట్ల మాధవ్ మన ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది

  • మీసం తిప్పి చూపించాడని, గోరంట్ల మాధవ్ కు జగన్ రెడ్డి ఎంపీ సీట్ ఇచ్చారు
  • ఇప్పుడు చూపించిన దానికి ఉపముఖ్యమంత్రి పదవి ఏమైనా ఇస్తారా..?
  • నెల్లూరులో కూడా గోరంట్ల మాధవ్ కు మించిన ఎమ్మెల్యే ఉన్నాడు
  • త్వరలో ఆయన ఆకృత్యాలను, ఆయన చూపించిన వాటిని కూడా బయట పెడతా
  • 151 మంది ఎమ్మెల్యే లలో 86 మంది పై ఘోర నేర చరిత్ర ఉంది
  • మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధులు బెజవాడ గోపాలరెడ్డి విగ్రహానికి ప్యూన్ చేత మాల వేయించారు
  • నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి షేక్. అబ్దుల్ అజీజ్

నెల్లూరు రూర‌ల్‌, ఆగ‌ష్టు 5 (స‌దా మీకోసం) :

నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి జేనీ రమణయ్యలతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ, గోరంట్ల మాధవ్ మన ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని అతను చేసిన ఆకృత్యాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంట్లో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

ఇలాంటి వారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెంచి పోషిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యేలు ఉంటే అందులో 86 మంది ఎమ్మెల్యేల పైన హత్య మానభంగం కిడ్నాప్ లాంటి సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు.

ఇది తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న విమర్శ కాదని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వారు ఇచ్చిన నివేదిక అని తెలిపారు.

ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలని వారి చరిత్రలు వారి వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని అన్నారు.

గోరంట్ల మాధవ్ నగ్నంగా నిలబడి వీడియోలు ఆడవారికి చూపిస్తున్నారని తెలిపారు. గతంలో మీసం తిప్పి చూపించాడని జగన్మోహన్ రెడ్డి మాధవ్ కు ఎంపీ ఇచ్చారని ఇప్పుడు చూపించిన దానికి ఏమి ఇస్తారు ఉప ముఖ్యమంత్రి ఏమైనా ఇస్తారా అనే ఎద్దేవా చేశారు.

దళితులు బడుగు బలహీన వర్గాలు మహిళలకు ఏదైనా సమస్య వస్తే వారు స్వయంగా తీర్చుకోలేరని ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి సహాయం అడుగుతారని, ఇలాంటి ప్రజాప్రతినిధులను మహిళలు ఏం మొహం పెట్టుకుని, సహాయం అడుగుతారు అని ప్రశ్నించారు.

అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ జోగి రమేష్ మదనపల్లి శాసనసభ్యులు మహిళలతో ఏ విధంగా ప్రవర్తించారో మనందరికీ తెలుసు అని అన్నారు.

వైసిపి ఎమ్మెల్యేలు ఇన్ని ఆకృత్యాలు చేస్తుంటే ఒక్కరి పైన అయినా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా, అందరికీ మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆ ఆడబిడ్డలకు మేనమామ కాదా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రికి ఉన్న వ్యక్తిగత సమస్యల వల్ల పరిపాలన ను గాలికి వదిలేసి, రాష్ట్రంపై భారాన్ని మోపడం సమంజసం కాదని, ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించడం ధర్మం కాదని అన్నారు. మర్డరిస్ట్, రేపిస్ట్, కిడ్నాపిస్ట్, దొంగ ఎమ్మెల్యేలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పునరావాస కేంద్రం అయిపోయిందని హేళన చేశారు. అందుకోసమే ఎటువంటి ఎన్నికలు వచ్చిన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు అని తెలిపారు.

గోరంట్ల మాధవ్ ను సస్పెండ్ చేసి ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని అతన్ని సస్పెండ్ చేయలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. నెల్లూరులో జరిగిన మద్యం షాపుల ఆక్షన్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి షాపుకి 50 లక్షల రూపాయల మామూలు తీసుకున్నారని విమర్శించారు.

ఇలాంటి పాపపు సొమ్మును తిన్నవారు మాములు చావు చవరని, పురుగులు పట్టి పోతారని అన్నారు. గోరంట్ల మాధవ్ కు మించిన ఎమ్మెల్యే నెల్లూరు జిల్లాలో ఉన్నారని ఆయన గోరంట్ల మాధవ్ ప్లస్ అని ఆయన చేసిన ఆకృత్యాలు కూడా త్వరలో మీ ముందు పెడతానని ఓట్లు వేసిన ప్రజలు అవి చూసి ఆనందించాలని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఆజాద్ ఇక అమృత మహోత్సవ నిర్వహిస్తున్నారని, అది చాలా గర్వించదగ్గ విషయం అని తెలిపారు.

భారత దేశ స్వాతంత్రం కోసం ఎందరో వారి ప్రాణమానాలను ఆస్తులను పణంగా పెట్టి ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు.

నేడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి జన్మదినమని, అధిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఆయన జన్మదినాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సింది పోయి ఒక ప్యూన్‌ ని పంపించి ఆయన విగ్రహానికి మాల వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

300ఆగస్టు 15 నాడు జండా వందనం చేయడం మాత్రమే కాదని ఇలాంటివి కూడా గమనించుకోవాలని ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. సమావేశంలో డాక్టర్ ఊరందూరు సురేంద్ర బాబు, మేకల నరేంద్ర రెడ్డి, సాబీర్ ఖాన్, కనపర్తి గంగాధర్, ఈదర శ్రీనివాసులు, అస్లామ్, జగన్, అషిక్ అలీ ఖాన్, వెంకట శేషయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!