వైద్యాధికారులందరూ భాద్యతాయుతంగా పనిచేయాలి

వైద్యాధికారులందరూ భాద్యతాయుతంగా పనిచేయాలి
జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్
నెల్లూరు కలెక్టరేట్, ఏప్రిల్ 18 (సదా మీకోసం) :
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యానికి అగ్రతాంబూలం ఇస్తున్న నేపథ్యంలో వైద్యాధికారులందరూ భాద్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ ఆదేశించారు.
మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వైద్యాధికారులు, ఐసిడిఎస్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ విధానం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారని, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో వివిధ రకాల చికిత్సలను చేర్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
పేద ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి వివిధ రకాల పధకాలను అమలు చేస్తుందన్నారు.
అందుకు తగ్గట్లుగా జిల్లాలోని వైద్యాధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులలో ఎటువంటి పరిస్థితుల్లోనూ జిల్లా వెనుకబడి ఉండకూడదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు.
ఫీవర్ సర్వే, కోవిడ్ కేసులు, గర్భస్థ మహిళలకు అందుతున్న వైద్యం, కంటి వెలుగు పధకం పురోగతి తదితర వైద్య సంబంధ విషయాలపై కూలంలుషంగా సమీక్ష నిర్వహించారు.
అదేవిధంగా వైద్య శాఖ ఉద్యోగుల ముఖ ఆధారిత హాజరు వంద శాతం ఉండాలని సూచించారు. విధులు పట్ల నిర్లిప్తంగా ఉండే వైద్యాధికారుల పై చర్యలు తప్పవన్నారు.
గర్భస్థ మహిళల రిజిస్ట్రేషన్ విషయంలో వైద్య శాఖ కు, ఐ సి డి యస్ వారికి తేడా ఉండరాదన్నారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ పెంచలయ్య, డి సి హేచ్ ఎస్ రమేష్ నాధ్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ జిల్లా ఇంచార్జి డాక్టర్ దయాకర్ , ఐ సి డి ఎస్ పి డి సౌజన్య, సి డి పి ఓ లు తదితరులు పాల్గొన్నారు.