నెలూరు క్లబ్ అభివృద్దికి కృషి చేయాలి : ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెలూరు క్లబ్ అభివృద్దికి కృషి చేయాలి
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
`: నెల్లూరు రూరల్, జూలై 26 (సదా మీకోసం) :`
నెల్లూరు రూరల్ నియోజకవర్గం దర్గామిట్టలోని నెల్లూరు క్లబ్ లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ… నెల్లూరు క్లబ్ లోని సభ్యులందరు కలసిమెలసి ఐక్యమత్యంగా ఉండి, నెల్లూరు క్లబ్ ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో ఏయంసి ఛైర్మెన్ యేసు నాయుడు, మాజీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, వైసీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.