ఇవిఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఇవిఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ పరిశీలించిన జిల్లా కలెక్టర్
రేణిగుంట,తిరుపతి.అక్టోబర్ 18 (సదా మీకోసం):
ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనలు మేరకు బి యు,సియులు, వివి ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతున్న కార్యక్రమం బెల్ ఇంజనీర్లు అప్రమత్తతో పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి ఆదేశించారు.బుధవారం ఉదయం
రేణిగుంట వద్ద వేర్ హౌసింగ్ కార్పోరేషన్ లో వున్న ఇవిఎం ల గోడౌన్ లో ఎఫ్.ఎల్.సి. ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించి పలు సూచనులు చేసారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్.ఎల్.సి.ద్వారా ఇవిఎం ల అనుసంధానం కార్యక్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరవుతున్నారని వారి సందేహాలు నివృత్తి చేయాలని సూచించారు.ఎఫ్.ఎల్.సి.ప్రక్రియకు బెల్ ఇంజనీర్లును కేటాయించిన మేరకు ఓటింగ్ యంత్రాల అనుసంధానం జరగాలని అన్నారు.విధులు కేటాయించిన సిబ్బంది,అధికారులు తప్పక హాజరు కావాలని ఎఫ్ ఎల్ సి ప్రక్రియ జరిగే హాల్ నందు ఎవరికి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని జాగ్రత్తగా ప్రక్రియ పూరిచేయాల్సి ఉంటుందని ఆదేశించారు.కలెక్టర్ పర్యటనలో ఇ ఎం ల నోడల్ అధికారి కోదండరామి రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐ.ఎన్.సి.చిరంజీవి,తెలుగుదేశం మనోహరాచారి జిల్లాలోని ఇడిటిలు,విధులు కేటాయించిన సిబ్బంది పాల్గొన్నారు