మానవత్వం చాటుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
మానవత్వం చాటుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు నగరం, నవంబర్ 20 (సదా మీకోసం) :
నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల్లో నాలుగు వేల మందికి త్రాగునీరు, భోజనం అందజేశారు.
భగత్ సింగ్ కాలనీ లో ఉదయం నుండి ఒక గర్భిణి నొప్పులతో బాధపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిసి మానవత్వం తో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పసుపు సైనికులు కలిసి పడవ సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఆ గర్భిణికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోటంరెడ్డి 5000 రూపాయలు ఆర్ధిక సాయం చేశారు.
ముంపు ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు మనోదైర్యం కల్పించి వారికి అండగా ఉంటాం అని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పునరా వాస కేంద్రాలు కు నేడు గతంలో చంద్రబాబు ప్రభుత్వం కట్టించిన ఎన్టీఆర్ గృహాలు ఉపయోగించటమే చంద్రబాబు ముందు చూపుకి నిదర్శనం అన్నారు. జగనన్న కాలనిలో మంత్రి అనిల్ కుమార్ కట్టించిన ఇళ్ళు ఎక్కడున్నాయో కనిపించడం లేదు అని ఎద్దేవా చేశారు.
ముంపు ప్రాంతాల ప్రజలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం నష్టపరిహారంగా 10000 ఇచ్చి ఆదుకున్నారు అని తెలిపారు. ఈ ప్రభుత్వం కనీస సౌకార్యలు కూడా కల్పించకపోవడం దౌర్బగ్యం అని విమర్శించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సాయంగా 25000 నగదు మరియు 25 కేజీలు బియ్యం, 5కేజీల నూనె, కందిపప్పు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్లు, స్థానిక టీడీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.