చంద్రబాబు నాయుడుపై పీహెచ్డీ చేసిన విద్యార్థి..!

0
Spread the love

చంద్రబాబు నాయుడుపై పీహెచ్డీ చేసిన విద్యార్థి..!

జార్ఖండ్ (స‌దా మీకోసం) :  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రధానమంత్రుల ఎంపికలో కీ రోల్‌ తో కింగ్‌ మేకర్‌ గా నిలిచారు.

రాజకీయాల్లో విశిష్ట స్థానం పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఓ విద్యార్థి PHD చేశారు.

రాజస్థాన్‌లోని ప్రముఖ ఓం ప్రకాష్‌ జోగేందర్‌ సింగ్‌- OPJS విశ్వవిద్యాలయంలో పొలిటికల్‌ సైన్స్‌ చేస్తున్న సోంగా దేవదాస్…. చంద్రబాబుపై పరిశోధన చేశారు.

నారా చంద్రబాబు నాయుడు -ఏ రోల్‌ మోడల్‌ అనే అంశంపై పరిశోధనాత్మక పత్రాలు సమర్పించి పొలిటికల్‌ సైన్స్‌ లో పీహెచ్డీ పొందారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు… దేశ, రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణ వ్యక్తిగా పేరుగడించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా, పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

సీఎంగా 15 ఏళ్ల అనుభవం అపారం కల్గిన చంద్రబాబు… ప్రతిపక్ష నాయకుడిగానూ తనదైన ముద్ర వేశారు.

రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రధానమంత్రుల ఎంపికలో కీ రోల్‌ తో కింగ్‌ మేకర్‌ గా నిలిచారు.

రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం పేరును మొదట ప్రతిపాదించింది కూడా చంద్రబాబే. టీడీపీ అధినేత రాజకీయ జీవితం విద్యార్థులకు రిసెర్చ్ అంశంగా మారింది.

సోంగా దేవదాస్‌ది కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు గ్రామం. జార్ఖండ్‌ లోని రాంచీలో ఆయన స్థిరపడ్డారు.

త్వరలోనే తన పీహెచ్డీ పట్టాతో ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చి చంద్రబాబును కలుస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!