ఎమ్మెల్యే శ్రీధరన్న అంటే కార్యకర్తలకు భరోసా
– నాయకులకు ఆ పేరు చెప్పలేనంత ఆత్మవిశ్వాసం
– నియోజకవర్గ ప్రజలకు ఆయన కుటుంబంలోని వ్యక్తి
– జగనన్న మాట.. కార్యకర్తల ఇళ్లకు కోటంరెడ్డి బాట చారిత్రాత్మకం
– 65 రోజుల్లో 5019 మంది కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం చరిత్ర
– 33వ డివిజన్ కార్పొరేటర్ మంజుల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
– ముగింపు కార్యక్రమంలో నాయకులతో కలిసి పాల్గొన్న మంజుల
– వైసీపీ నాయకులతో కలిసి బైక్ లలో వెళ్లి 30వ డివిజన్‌లో పాల్గొన్న నేతలు
నెల్లూరు రూరల్, మార్చి 1 (సదా మీకోసం) :
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొండంత భరోసా అని 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల పేర్కొన్నారు.
పార్టీ నాయకులకు ఆ పేరు చెప్పలేనంత ఆత్మవిశ్వాసం ఇస్తుందని, నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కుటుంబంలోని వ్యక్తి లాంటి వారని కొనియాడారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ”జగనన్న మాట.. కార్యకర్తల ఇళ్లకు కోటంరెడ్డి బాట” కార్యక్రమం మంగళవారంతో 65 రోజులతో పూర్తి అయిన సందర్భంగా చివరి రోజు 30వ డివిజన్‌లో కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారితో వారి సమస్యలపై వకాబు చేసి, ఆప్యాయంగా పలకరించారు.
ఈ కార్యక్రమం ముగింపు రోజు 30వ డివిజన్‌కు నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ప్లకార్డులు, ఎమ్మెల్యే చిత్ర పటాలు చేతపట్టి ర్యాలీగా 30వ డివిజన్‌కు చేరుకున్నారు. ముందుగా కరణం మంజుల మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చేపట్టిన “జగనన్న మాట.. కార్యకర్తల ఇళ్లకు కోటంరెడ్డి బాట” చారిత్రాత్మకమని, 65 రోజుల్లో 5019 మంది కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం ఒక చరిత్ర అన్నారు. సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు తెస్తూ మరోవైపు తనకు అండగా నిలిచిన కార్యకర్తల కోసం ప్రతి రోజు ఎటువంటి హంగామా లేకుండా వారి ఇళ్లకు వెళ్లి సమస్యలకు తెలుకుంటూ ముందుకు వెళ్లడం రాష్ట్రంలో మరెక్కడా జరగ లేదన్నారు. అందుకే ఎమ్మెల్యే శ్రీధరన్న అంటే కార్యకర్తలకు భరోసా అని పునరుద్ఘాటించారు. భగవంతుడు ఎమ్మెల్యే శ్రీధరన్నను చల్లగా చూడాలని, ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.