టిబి రాదని అలక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి : హెచ్చరించిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు
టిబి రాదని అలక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి : హెచ్చరించిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజూ టిబి వ్యాధి కారణంగా 4వేల మంది చనిపోతున్నారని, ఆ వ్యాధి తమకు రాదని అలక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ సుస్మితా రెడ్డి హెచ్చరించారు.
ప్రపంచ టిబి దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో అవగాహన కార్యక్రమం జరిగింది.
హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలు డాక్టర్ సుస్మితా రెడ్డి, హాస్పిటల్ నోడల్ అధికారి అబ్ధుల్ హమీద్ హాజరయ్యారు.
డాక్టర్ సుస్మితా రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ నేపద్యంలో దేశంలో టిబి కేసులు గణనీయంగా పెరిగాయన్నారు.
కరోనా సోకి, తగ్గిన తర్వాత అనేక మంది టిబి వ్యాధి బారిన పడుతున్నారని చెప్పారు.
తరచుగా జ్వరం, చలి రావడం, రెండు వారాల కంటే ఎక్కువగా దగ్గు వస్తుండటం టిబి వ్యాధి లక్షణాలని తెలియజేశారు.
అలాంటి లక్షణాలు ఉన్న వారి అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ప్రభుత్వం కూడా టిబి నిర్మూలనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తుందని చెప్పారు.
మెడికవర్ హాస్పిటల్ లో టిబి వ్యాధికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చికిత్స అందుబాటులో ఉందన్నారు.
హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ మాట్లాడుతూ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలు డాక్టర్ సుస్మితా రెడ్డి రోగులకు సేవ చేయడమే పరమావధిగా భావించి పనిచేస్తున్నారని ప్రసంశించారు.
వైద్య వృత్తిలో ఉండే చాలా మంది వృత్తిలో భాగంగానే వైద్యం చేస్తుంటే… డాక్టర్ సుస్మితా రెడ్డి మాత్రం సేవ చేయాలన్న భావంతో వైద్యం చేస్తున్నారని… ఆమె మెడికవర్ హాస్పిటల్ లో ఉండటం అదృష్ఠమని పేర్కొన్నారు.
టిబి వ్యాధికి మెడికవర్ లో అత్యాధునికి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
అలాగే హాస్పిటల్ నోడల్ అధికారి అబ్ధుల్ హమీద్ సేవలను కూడా కొనియాడారు. అనంతరం వారిద్దర్ని సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆపరేషన్ హెడ్ వర ప్రసాద్, హాస్పిటల్ సూపరింటెండ్ డాక్టర్ ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు.