ఆ అద్దె భవనం ఎందుకు కాళీ చేయలేదు ?
అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా ?
ఆ అద్దె భవనం పేరుతో సుమారు 3 లక్షలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం !
అక్కడ ఉన్న ప్రభుత్వ ఎక్యూప్‌మెంట్ భద్రంగా ఉందా ?
కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటున్న మీడియా ప్రతినిధులు, జర్నలిస్టు నాయకులు
నెల్లూరు ప్రతినిధి, ఆక్టోబర్ 09 (సదా మీకోసం) :
నెల్లూరు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమాచార శాఖ ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు కార్యాలయం (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం) కలిపి 30 నెలలు అవుతుంది.
అయినా అద్దె భవనం కాళీ చేయకుండా అద్దె భవనానికి నెలకు సుమారు 10వేల రూపాయలు చెల్లిస్తూ ఆ అద్దె భవనం కొనసాగించడం గమనార్హం.
సమాచార శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో లక్షలాది రూపాయల విలువైన మైకులు, మైక్రోఫోన్లు, ఎక్విప్మెంట్ గల్లంతు అయినట్లు విమర్శలు వస్తున్నాయి.
స్టాక్, ఫర్నిచర్ రిజిస్టర్లు మాయం అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారులు ఒరిజినల్ స్టాక్ రిజిస్టర్, ఫర్నిచర్, రిజిస్టర్లు పరిశీలించి ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు అనేది బయటపడతాయి.
గత రెండు సంవత్సరాలుగా రిపోర్టులు పరిశీలన జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఆధునిక ఎక్విప్మెంట్ కనిపించడంలేదని, లేప్టాప్, కంప్యూటర్లు ఎక్కడ వున్నాయో ఆ దేవుడికే ఎరుక అంటున్నారు.
జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో సమాచార శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంని కలిపి 30 నెలలు అయినా, అద్దె భవనం కాళీ చేయకపోవడానికి కారణం ఏలిన వారికే తెలియాలి.
అక్కడ అసాంఘిక కార్య కలాపాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. స్క్రీన్ల ఏర్పాట్లలో చేతివాటం జరుగుతుందని, కార్యాలయం ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ ఏజెన్సీలకు ఇచ్చి బిల్లులు చేసుకుంటున్నట్లు ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంజినీరింగ్ విభాగంలో పని చేశే వారు ఎంతమంది వున్నారు? వారు చేసే పనేమిటి? అనే విషయాలు ఇప్పటికీ గోప్యమే.
పని లేక పోవడంతో విధులకు డుమ్మా కొట్టి ఇతర వ్యాపకాలలో మునిగి తేలుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఈ అద్దె భవనానికి నెలకు 10 వేలకు పైగా అద్దె చేల్లిస్తూ ఇప్పటి వరకు సుమారు 3 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే అధికారులు దుర్వినియోగం చేశారన్న విమర్శలున్నాయి.
ఇంజనీరింగ్ విభాగంలో పనిచేశేవారు తమకున్న పరిచయాలతో ప్రభుత్వం ఇంజినీరింగ్ విభాగానికి అదనపు గది కేటాయించకుండా మోకాలు అడ్డుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా? లేదా? వారికి కేటాయించిన ఎక్యూప్‌మెంట్ రిజిష్టర్ ప్రకారం ఉన్నాయా? 3 లక్షల వరకు ప్రభుత్వ ధనం ఎందుకు దుర్వినియోగం అయింది అనే విషయాలు కలెక్టర్ పరిశీలించి నిజాలను నిగ్గు తేల్చాలని మీడియా ప్రతినిధులు, జర్నలిస్టు నాయకులు కోరుతున్నారు.
తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?
ఈ మద్య చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మైకులు పనిచేయకపోవడం గమనార్హం. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు సమాచార శాఖ అధికారులను పిలవగా ఇంజినీరింగ్ సిబ్బంది అక్కడి నుండి పరార్ కావడం గమనార్హం.
ఆ సమయంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులపై చర్యలు తీసుకుంటారని అప్పట్లో ప్రచారం జరిగినా, అటువంటి సమాచారం ఏది ఇప్పటివరకు అందలేదు.
పై స్థాయిలో మేనేజ్ చేసుకున్నారన్న అభియోగం ఇంజినీరింగ్ విభాగంపై ఉంది.
ఆ సమయంలో కొద్ది మంది క్రింది స్థాయి ఉద్యోగులను కలెక్టర్ కార్యాలయానికి అప్పగించడం తప్ప సమాచార శాఖ ఇంజినీరింగ్ విభాగంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇది చూసిన మీడియా వారు, తప్పు ఎవరు చేశారు? శిక్ష ఎవరికి పడింది అని గుసగుసలాడుకుంటున్నారు.
వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న అనుమానం మీడియా వర్గాల్లో అనుమానం కలుగుతుంది.
పై అధికారులకు తెలియజేస్తాం : డి.ఐ.పి.ఆర్.ఓ. కే. సదారావు
సమాచార శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం అద్దె భవనంలో ఇప్పటికీ కొనసాగుతున్న విషయం, ఎక్యూప్‌మెంట్ పై ఉన్న అనుమానాలు, అసాంఘిక కార్యకలాపాల విషయమై నెల్లూరు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి (డి.ఐ.పి.ఆర్.ఓ.) కే. సదారావును వివరణ కోరగా. సమాచార మాధ్యమాలలో ఈ విషయమై పోస్టులు వచ్చాయని, వాటిపై విచారణ చేసి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.