58వ రోజుకు “జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట”

58వ రోజుకు “జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట”
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) :
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహిస్తున్న “జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట” కార్యక్రమం నేటితో 58వ రోజుకు చేరుకుంది.
బుధవారం 36వ డివిజన్లో ఉదయం 7 గంటలకు సుగుణమ్మ అనే కార్యకర్త ఇంటి నుండి ప్రారంభించారు.
రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్, బ్రహ్మానందపురం ప్రాంతాలలో ప్రతీ కార్యకర్తతో, ప్రతీ నాయకునితో వారి ఇంటిలోనే ఏకాంతంగా మాట్లాడుతూ, ఒక కార్యకర్త ఇంటి నుండి మరో కార్యకర్త ఇంటికి వెళ్లే మార్గమధ్యలో స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ, సంక్షేమ పథకాల గురించి ఆరాతీస్తూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుకు సాగారు.
కార్యక్రమంలో 36వ డివిజన్ కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ, 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పిండి సురేష్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.