ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్
నెల్లూరు నగరం, జూలై 19 (సదా మీకోసం) :
నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆరోగ్యం సరిగా లేక చికిత్స పొంది, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ కి విన్నవించుకోగా, అందుకు స్పందించి 42 మందికి రూ. 35 లక్షల రూపాయల చెక్కులను మంజూరు చేయించారు.
ఆ చెక్కులను నగరంలోని రాజన్న భవన్ లో ఎమ్మెల్యే డాక్టర్ పి. అనీల్ కుమార్ బాధితులకు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎం.డి.ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు వేలూరు మహేష్, పోట్లూరి రామకృష్ణ, నీలి రాఘవరావు, ఊటుకూరు నాగార్జున, గుంజి జయలక్ష్మి, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, ఎస్.ఆర్.ఇంతియాజ్, కాయల సురేష్ బాబు, షేక్ ముజీర్, ఏ.పి.ఆగ్రో డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ కొణిదల సుదీర్, తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్