రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వేమిరెడ్డి జన్మదిన వేడుకలు
రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వేమిరెడ్డి జన్మదిన వేడుకలు
నెల్లూరు రూరల్, ఏప్రిల్ 19 (సదా మీకోసం)
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలమేరకు రాజ్యసభ సభ్యులు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, అత్యంత కష్టకాలంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలచిన గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నానని అన్నారు.
కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.