ఘనంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు
నెల్లూరు మూలాపేట రాజాగారివీధిలో 62వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమం
అనంతరం కోటమిట్ట మెక్లిన్స్ రోడ్డు గుంతలకు వైసీపీ రంగులు వేసి జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్
రెండు చోట్ల కేక్ కట్ చేయించి సంబరాలు చేసిన కార్యకర్తలు, నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో సాయంత్రం జరిగిన వేడుకలు
నెల్లూరు నగరం, జూలై 17 (సదా మీకోసం) :
నెల్లూరు నగర నియోజకవర్గంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి 62వ రోజున 39వ డివిజన్ మూలాపేట లోని రాజావారివీధి ప్రాంతంలో నిర్వహించారు.
అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ “గుడ్ మార్నింగ్ సీఎం సార్” #GoodMorningCMSir కార్యక్రమాన్ని నెల్లూరు సిటీ 42వ డివిజన్ లోని కోటమిట్ట మెక్లిన్స్ రోడ్డు వద్ద నిర్వహించి ఆ రోడ్డు పైన గుంతలకు వైసీపీ బులుగు, పచ్చ రంగులను అద్దారు.
నేడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదినం కావడంతో పార్టీ కార్యకర్తలు ఉత్సహంగా వేడుకలు నిర్వహించారు.
పార్టీ కార్యక్రమాల నిర్వహణ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చి, కేక్ కటింగ్ చేయించారు.
సాయంత్రం నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు కొనసాగాయి.
సోషల్ మీడియాలో సైతం రాష్ట్రం నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు వేలాది మంది కేతంరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తన జన్మదినాన్ని వేడుకలా చేసిన అందరికీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.