ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట
ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట
నెల్లూరు నగరం, ఆగష్టు 5 (సదా మీకోసం) :
నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80 రోజులు పూర్తి చేసుకుంది.
నేడు 81వ రోజున 51వ డివిజన్ కపాడిపాళెం ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ప్రారంభించారు.
స్థానిక జనసేన నాయకులు కాయల వరప్రసాద్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు కోలాహలంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ 80 రోజుల క్రితం ప్రారంభమైన పవనన్న ప్రజాబాట నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 3, 4, 5, 39, 40 మొత్తం ఐదు డివిజన్లలో ఏ ఒక్క ఇంటిని కూడా విస్మరించకుండా, ఐదో అంతస్తులోని కుటుంబాలను కూడా పలుకరిస్తూ సాగిందన్నారు.
ప్రజలందరూ అపూర్వంగా ఆదరిస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, వారి ఆదరాభిమానాలతో రెట్టింపు ఉత్సాహంతో ప్రజాబాటని నిర్వహిస్తున్నామని అన్నారు.
ఒక్కో డివిజన్లో మొత్తం అన్ని ఇళ్ళకు తిరిగి సమస్యలను అధ్యయనం చేయడానికి 15 రోజుల నుండి 20 రోజుల వరకు పడుతోందని, ఇప్పుడు ప్రారంభించిన 51వ డివిజన్లో కూడా సుమారు రెండు వారాలకు పైగానే పట్టొచ్చని అన్నారు.
కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.