జోరు వర్షంలోనూ ఆగని పవనన్న ప్రజాబాట
అపూర్వంగా ఆదరిస్తూ అధికార పార్టీకి బెదరక స్వేచ్ఛగా సమస్యలను చెప్తున్న ప్రజలు
పలు ఇళ్ళలో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి హారతులిచ్చి విజయతిలకం దిద్దుతున్న మహిళలు
ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెల్పిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు నగరం, జూలై 8 (సదా మీకోసం) :
గత 53 రోజులుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 53వ రోజున జోరు వర్షంలోనూ ఆగకుండా కొనసాగింది.
మూలాపేటలోని రామిరెడ్డిపేట ప్రాంతంలో పలు వీధులలో ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవనన్న ప్రజాబాటకు నెల్లూరు సిటీ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని అన్నారు.
భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు తమని సొంత బిడ్డలుగా ఆదరించి స్వాగతిస్తున్నారని తెలిపారు.
అధికార వైసీపీ పార్టీకి ఏమాత్రం బెదరకుండా పలువురు తమ సమస్యలను విన్నవిస్తున్నారని, తమ పరిధిలో పూర్తి కాగల సమస్యలను తామే పరిష్కరిస్తామని, సంబంధిత సచివాలయ అధికారుల దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లి పరిష్కరింపజేస్తున్నామని, అక్కడా పరిష్కారం వాటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని వివరించారు.
పలు ఇళ్ళలో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి మహిళలు హారతులిచ్చి విజయతిలకం దిద్దారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలందరూ భావిస్తున్నారని, ఆ దిశగా ప్రజలకు అండగా ఉంటూ పవనన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.