పాము కంటే తేలు ప్రమాదకారి !
పాము కంటే తేలు ప్రమాదకారి !
ఎందుకంటే పాము విషానికి విరుగుడు మందు ఉంది. తేలు విషానికి విరుగుడు మందు ఇంతవరకు కనుగొనబడలేదు.
అందుకే తేలు కాటుకు ప్రాథమిక వైద్యం చాలా ముఖ్యం. పాము కరిచినప్పుడు నొప్పి అంతగా ఉండదు.
తేలు కుట్టినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించుకోవడం తేలు కాటు వైద్యం లో చాలా ప్రధానం.ఈ నొప్పి భలే విచిత్రంగా ఉంటుంది.
నొప్పిగా, తిమ్మిరి గా, అటు ఇటు పాకినట్లు గా రకరకాలుగా ఉంటుంది.
సాధారణంగా నొప్పికి వాడే సూది మందు కూడా పెద్దగా పని చేయదు.
చల్లని కాపటం తో ఈ నొప్పిని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
ఐసు ముక్కలను గుడ్డలో కానీ,ప్లాస్టిక్ కవర్ లో కానీ, నీళ్లు తాగే గ్లాస్ లో కానీ వేసుకుని తేలు కుట్టిన భాగంలో కాపటం పెడితే నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది.
కాపటం పెట్టుకుంటూ వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించాలి.
వైద్యుని దగ్గరకు చేరే లోపు మరో రెండు పనులు చేయాలి.
తేలు కుట్టిన భాగాన్ని గుండె కంటే దిగువన ఉండే విధంగా చూసుకోవాలి.
గుండె కంటే ఎత్తులో ఉంచితే విషం త్వరగా గుండెకు చేరి ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది.
తేలు కుట్టిన భాగంలో బిగుతుగా ఉండే ఉంగరం, మెట్టెలు, గాజులు లాంటి ఆభరణాలను తీసివేయడం వెంటనే చేయవలసిన రెండో పని.
అలా చేయకపోతే తేలు కుట్టిన భాగంలో వాపు పెరిగి, వేళ్ళకు రక్త ప్రసరణ తగ్గి కొన్ని సందర్భాలలో వేలు తీసివేయవలసిన పరిస్థితి రావచ్చు.
ఇలా ప్రాథమిక వైద్యం చేసుకుంటూ వీలైనంత త్వరగా డాక్టర్ ద్వారా మిగిలిన వైద్యాన్ని చేయించుకోవాలి
డా. యం.వి.రమణయ్య
సీనియర్ వైద్యులు, రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల, నెల్లూరు.
రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక, ఆంధ్ర ప్రదేశ్.