భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: మోదీ
న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా కంపెనీలకు ఆహ్వానం పలికారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేతృత్వంలో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐకి అనుమతిచ్చామని మోదీ గుర్తు చేశారు. రక్షణ రంగంలోనూ అలాగే అంతరిక్ష రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని సూచించారు. రక్షణ రంగంలో ఏకంగా 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ, మౌలిక వసతుల కల్పన రంగంలో కూడా పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ఇళ్లు, రోడ్లు, హైవేలు, పోర్టుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. భారత్-అమెరికా సహజ మిత్రులన్న ప్రధాని ఆత్మనిర్భర్ భారత్ కోసం అమెరికా తోడ్పాటు అవసరమని చెప్పారు.