జడ్పీ నుండి రూరల్ మండలానికి నిధులు మంజూరు చేశాం : జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

0
Spread the love

జడ్పీ నుండి రూరల్ మండలానికి నిధులు మంజూరు చేశాం

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

నెల్లూరు జడ్పీ ఆగస్టు 6 (సదా మీకోసం):

నెల్లూరు రూరల్ మండల కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మండల పరిషత్ అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ రూరల్ మండలంలోని గ్రామాలలో పర్యటించినపుడు వివిధ గ్రామ పంచాయితీల నుండి వచ్చిన అభ్యర్ధన మేరకు గ్రామ పంచాయితీల అభివృద్ధి కొరకు జిల్లా పరిషత్ నుండి 15 వ ఆర్దిక సంఘ నిధులను విడుదుల చేసామని వివరించారు.

దేవరపాలెం గ్రామ పంచాయితీలో ఆర్వో ప్లాంట్ ఆరు లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు

కొమ్మరపుడి గ్రామ పంచాయితీలో ఆర్వో ప్లాంట్ ఆరు లక్షల రూపాయలతో మంజూరు చేశామన్నారు.

కొండ్లపుడి గ్రామ పంచాయితీ లోని శ్మశానవాటిక నందు ఒక లక్ష రూపాయలతో బోరు ఏర్పాటు మంజూరు చేసినట్లు తెలిపారు.

కొత్త వెల్లంటి గ్రామ పంచాయతి నందు సిసి రోడ్డు డేభై ఐదు వేల రూపాయలతో మంజూరు చేశామన్నారు.

పొట్టేపాలెం గ్రామ పంచాయతి నందు ఇంటర్నల్ సిసి రోడ్లు పద్నాలుగు లక్షల రూపాయలతో మంజూరు చేశామన్నారు..

కొత్త వెల్లంటి గ్రామ పంచాయితీ నందు కమ్యూనిటి హాలు పదహారు లక్షల రూపాయలతో మంజూరు చేశామని తెలిపారు.

సౌత్ మోపూరు గ్రామ పంచాయితీ నందు ఇంటర్నల్ సిసి రోడ్లుకి పది లక్షల రూపాయలు, శ్మశానవాటికకు ప్రహరిగోడ మరియు లేవలింగ్ చేయుటకు ఐదు లక్షలు మంజూరు చేశామన్నారు.

ఉప్పుటూరు గ్రామ పంచాయితీ నందు ఇంటర్నల్ సిసి రోడ్లు ఎనిమిది లక్షల రూపాయలతో మంజూరు చేశామని తెలిపారు.

కందమూరు గ్రామ పంచాయితీ నందు రోడ్లు నిర్మాణం కొరకు పన్నెండు లక్షల రూపాయలతో మంజూరు చేశామని పేర్కొన్నారు.

అలాగే శాసన సభ్యులు మండలంలో చేసిన ప్రతిపాదనల మేరకు దాదాపు 85 లక్షలు జిల్లా పరిషత్ నుండి 15 వ ఆర్దిక సంఘ నిధులు మంజూరు చేశామని వివరించారు.

కొత్త వెల్లంటి గ్రామ పంచాయితీ లో నేను పర్యటించినపుడు అక్కడి గ్రామస్తులు కోరిక మేరకు జిల్లా పరిషత్ లోని 15 వ ఆర్దిక సంఘ నిధుల నుండి కొత్త వెల్లంటి నుండి పాత వెల్లంటి వరకు సిసి రోడ్డు నిర్మించుటకు 45 లక్షలు మంజూరు చేశామని తెలిపారు.

మండలంలోని గ్రామ పంచాయితీలలో ఏదైనా సమస్య ఉంటె తన దృష్టి తెలియజేసిన యెడల జిల్లా పరిషత్ ద్వారా తన వంతు సహాయం చేయుటకు ప్రయత్నం చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!