యూపీలో రికార్డు స్థాయికి కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 2308 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీలో ఒకేరోజు ఇన్ని కరోనా కేసులు రావడం ఇదే తొలిసారి అని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 55,588కి చేరినట్టు వెల్లడించారు. కాగా గడచిన 24 గంటల్లో ఉత్తర ప్రదేశ్‌లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,263కి పెరిగింది. ప్రస్తుతం 20,825 మంది కరోనా పేషెంట్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు అదనపు ముఖ్య కార్యదర్శి ( వైద్య, ఆరోగ్య శాఖ) అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 33,500 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు ఆయన తెలిపారు.