ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు రూరల్, ఏప్రిల్ 15 (సదా మీకోసం) :
“జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట” కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తవెల్లంటి గ్రామంలో 5వ రోజు నిడారంబరంగా ప్రారంభమైంది.
గతరాత్రి సజ్జాపురం గ్రామంలోని అమ్మోలి వెంకట రత్నం ఇంట్లో బస చేసి, నేటి ఉదయం కొత్తవెల్లంటి గ్రామంలోని కట్టా మధుసూదన్ ఇంటి నుంచి 5వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఉదయం 7 గంటల నుండి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా ప్రజల ఇంటికి వెళ్ళి గడప తట్టి పలకరించి, వారి ఇంట్లోనే కూర్చోని కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పధకాలపై ఆరాతీసి, అనంతరం వారు ఎదుర్కొంటున్న సమ్యలను తెలుసుకున్నారు.