CPM News : ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపియం నిరసన

ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపియం నిరసన
నెల్లూరు రూరల్, ఏప్రిల్ 4 (సదా మీకోసం) :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజల్, గ్యాస్, విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచడాన్ని నిరసిస్తూ, సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప గుడి సెంటర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వంట గ్యాసు వెయ్యి దాటిందని, పెట్రోల్ రూ. 119 డీజిల్ రూ.104 పన్నుల భారం ప్రజలపై మోపడం చాలదు అన్న విధంగా, విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజలపై మాత్రమే పెంచడం, కొత్తగా చెత్త సేకరణ పై పన్ను విధించడం, ఇంటి పన్నులు పెంచడం, వంట నూనె రూ. 200 చేరడం, ఉప్పు, పప్పు, కూరగాయలు ధరల పెరుగుదల ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సామాన్య ప్రజలు నిత్యవసర వస్తువులను కొనుక్కునే పరిస్థితి లేదని అన్నారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విడనాడాలని లేనిపక్షంలో ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం ప్రజలను సమీకరించి ముందుండి పోరాడుతుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన అధిక ధరలను తగ్గించాలని కోరారు.
కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు రూరల్ కార్యదర్శి వర్గ సభ్యులు కిన్నెర కుమార్, కొండ ప్రసాద్, రూరల్ కమిటీ సభ్యులు దేవతాటీ సంపత్ కుమార్, శాఖా కార్యదర్శులు ఎస్కే కాలేషా, బాబు, కామయ్య, పోతురాజు శ్రీనివాసులు, పార్టీ సానుభూతిపరులు, ప్రజలు పాల్గొన్నారు.