800 కోట్లు అభివృద్ధి ఎక్కడ..? అనీల్

800 కోట్లు అభివృద్ధి ఎక్కడ..? అనీల్
- భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు
- ఇరిగేషన్ పనుల్లో వాటాలు మాత్రం దండుకున్నావు
- హరినాథపురం సెంటర్ వద్ద పెట్టిన టైమర్ ఏమైంది
- మంత్రి అనిల్ పై ధ్వజమెత్తిన టిడిపి నేత కోటంరెడ్డి
నెల్లూరు నగరం, ఏప్రిల్ 13 (సదా మీకోసం) :
నెల్లూరు నగరం నియోజకవర్గం పరిధిలోని 51,వ డివిజన్ కపాడి పాలెం లో తెలుగుదేశం పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి (Kotam Reddy Srinivasulu Reddy) ఆధ్వర్యంలో వైయస్ జగన్ ప్రభుత్వం హయాంలో పన్ను భారాలను వివరిస్తూ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
గత మూడేళ్ల వైసిపి పాలనలో పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీలు, పన్ను భారాలను కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి (Kotam Reddy Srinivasulu Reddy) స్థానిక ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ పెరిగిన ధరలతో జీవనం సాగించడం కష్టతరమైనది అని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోటంరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ నమ్మితే పేద ప్రజల పరిస్థితి బాదుడే బాదుడు గా ఉంటుందన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలంటూ విర్రవీగిన వైకాపా నేతలు అధికారంలోకి రాగానే ఏసీ రూముల్లో నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) నెల్లూరు నగరంలో 800 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రగల్భాలు చెప్పడం అత్యంత అపహాస్యమైన విషయమని టిడిపి నెల్లూరు నగరం నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు.
నెల్లూరు 51 వ డివిజన్ లో బాదుడే బాదుడు కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత మూడేళ్లుగా మంత్రి పదవి వెలగబెట్టిన అనిల్ హయాంలో నెల్లూరు నగరంలో చేసిన అభివృద్ధి భూతద్దం పెట్టి వెతికిన కనిపించడం లేదన్నారు.
సర్వేపల్లి కాలువ పనులకు సంబంధించి 30 కోట్ల అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు మాజీ మంత్రి అనిల్ కుమార్ కే దక్కిందని విమర్శించారు.
ఇరిగేషన్ పనుల్లో మాత్రం మాజీ మంత్రి వాటాలు బాగానే దండుకున్నారని ధ్వజమెత్తారు. పెన్నా వరదనీటి వల్ల ప్రజల నివాసాలు మునిగిపోకుండా ఆనకట్ట నిర్మించాలని టెండర్లు పిలిస్తే అది మంత్రి అనుచరులకు రాలేదని గునపాటి మురళీకృష్ణ రెడ్డిని బెదిరించిన ఘనత వారికే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
దీనిపై ఇప్పటికే కేసు కూడా నమోదయిందన్నారు. హరినాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి ని ఖచ్చితంగా సమయంలో పూర్తి చేస్తాం అని చెప్పి టైమర్ పెట్టిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేడు ఆ టైమర్ ఏమైందని ప్రశ్నించారు.
మంత్రి అనిల్ అభివృద్ధికి ఆమడ దూరమని చెప్పుకునేందుకు అయినా సిగ్గు ఉండాలి అని ఆయన విమర్శించారు.
పేద ప్రజలకు తొమ్మిది అంకణాల స్థలం ఇస్తానని చెప్పి ఆరు అంకణాల స్థలం అది వరదల్లో మునిగిపోయే ప్రాంతంలో ఇచ్చిన ఘనత మంత్రి అనిల్దని ఎద్దేవా చేశారు చేశారు.
మొత్తం 5600 ప్లాట్లు ఇక్కడ ఇస్తే ఇప్పటికి 176 ఇళ్ళకు మాత్రమే బేస్ మట్టాలు మాత్రమే వేశారని.. ఇదా నీ అభివృద్ధి అంటూ ఆయన ప్రశ్నించారు
నగర పార్టీ అధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కప్పిర శ్రీనివాసులు,పిట్టి సత్యనాగేస్వరారావు ఖాదర్ భాషా కువ్వారపుబాలాజి, వెంకయ్యయాదవ్ ఇక్బాల్,నగర తెలుగు మహిళ అధ్యక్షరాలు రేవతి,శ్రీదేవి స్థానిక నాయకులు డివిజన్ ఇంచార్జ్ ప్రశాంత్ మైకేల్ నగర SC సెల్ అధ్యక్షులు అరవ కిషోర్ చంద్రషేకేర్ డివిజన్ అధ్యక్షులు కమతం ప్రశాంత్ సమీప 6,7,46,47,48,49,50,52 డివిజన్ ల అధ్యక్షులు పాల్గొన్నారు.