చేనేత కార్మికులకు చేయూత నివ్వాలి : జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు
చేనేత కార్మికులకు చేయూత నివ్వాలి
జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు
నెల్లూరు, మార్చి18 (సదా మీకోసం):
వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు చేయూత నివ్వాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు విజ్ణప్తి చేశారు.
శుక్రవారం ఉదయం నగరంలోని ఎన్జీవో హోం నందు రాష్ట్ర ప్రభుత్వ చేనేత జౌళి శాఖ వారు ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలేక్టరు మాట్లాడుతూ చేనేత కళ ఆయా కుటుంబాల్లో వృత్తిగా మారిందన్నారు.
రాష్ట్రం లోని అనేక ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఇప్పటికీ వారి కళను పోషిస్తున్నారు. వారిని ప్రోత్సహించ వలసిన భాద్యత ప్రతి ఓక్కరిపై ఉందన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు మేలు చేసేందుకు నేతన్ననేస్తం కార్యక్రమం అమలు చేస్తున్నారన్నారు.
వారి ఉపాధి అవకాశాలు పేంపోందించేందుకు 25వేల రూపాయల నగదు నేరుగా వారి అకౌంట్స్ లో ప్రభుత్వం జమ చేస్తున్నదన్నారు. చితికి పోయిన వారి కుటుంబాలను పునరుజ్జీవం చేసేందుకు ఊతంగా ఉపయోగపడతాయన్నారు.
అదేవిధంగా చేనేత కార్మికులకు ఇళ్ళ నిర్మాణం లో కూడా వారి మగ్గాలకు అనుకూలంగా నిర్మాణం చేయించడం జరుగుతుందన్నారు. చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయంగా ప్రత్యేక స్థానం ఉందన్నారు. జిల్లాలోని వేంకటగిరి జరీ చీరలు ప్రత్యేక స్థానం సంపాదించాయని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేరేన్నికగన్న ప్రముఖ ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాంతాల నుండి చేనేత ఉత్పత్తులు ఈ వస్త్ర ప్రదర్శన లో ఉంచడం జరిగిందన్నారు. నెల్లూరు ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని కేవలం గిట్టుబాటు ధరకే అందిస్తున్న చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గోన్న నగర మేయర్ శ్రీమతి స్రవంతి మాట్లాడుతూ చేనేత కార్మికుల కు ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. సంప్రదాయ చేనేత వస్త్రాలు ధరిస్తే ఆరోగ్య పరంగా కూడా మంచిదనన్నారు.
జాయింట్ కలేక్టరు శ్రీమతి రోజ్ మాండ్ మాట్లాడుతూ చేనేతల బతుకుల్లో వేలుగులు నింపేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగ పడతాయన్నారు.వస్త్రాలు ఇష్టపడని మహిళలు ఉండరని, కావున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలన్నారు. అంతే కాకుండా ఈ వేసవిలో చేనేత వస్త్రాలు ధరిస్తే ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో చేనేత జౌళి. శాఖ సహాయ సంచాలకులు ఆనంద కుమార్ పాల్గోన్నారు.