కరోనా గురించి ఆందోళన వద్దు-ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది-కలెక్టర్ చక్రధర్ బాబు
కరోనా గురించి ఆందోళన వద్దు-ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది-కలెక్టర్ చక్రధర్ బాబు
-: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :-
నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు, వైద్యులతో కరోనా మహమ్మారి నివారణ చర్యలపై సమీక్షా, సమావేశం నిర్వహించారు.
వచ్చే రెండు వారాల్లో జిల్లాలో అధికంగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని.., దీనిని గమణించి ప్రైవేటు ఆస్పత్రులు సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.
ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తోందని.., అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ, ల్యాబులలో కరోనా వ్యాధి నిర్ణారణ పరీక్షలు నిర్వహించుకోవచ్చని.., దానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ నాగార్జునను కలెక్టర్ ఆదేశించారు.
ఆస్పత్రికి వచ్చిన ప్రతి వ్యక్తికి చికిత్స అందించాలని, ఎవ్వరికీ చికిత్స నిరాకరించరాదన్నారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కంటే నెల్లూరు జిల్లా కరోనా నివారణ చర్యలలో ముందుందన్నామని, కరోనా వల్ల మరణాలు సంభవించకుండా వైద్యులు నిబద్దతతో పనిచేయాలన్నారు.
తీవ్ర జ్వరం, రక్తంలో ఆక్సిజన్ శాతం కంటే తక్కువ ఉన్న పేషెంట్స్ కి రిపోర్ట్సు రావడం ఆలస్యం అయినా కూడా, వేచి చూడకుండా కరోనా చికిత్స చేయాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆస్పత్రుల్లో కరోనా వ్యాధి నిర్థారణ పరీక్షలు వేగవంతం చేయాలన్నారు.
ప్రతిరోజూ తమ ఆస్పత్రిలో ఎన్ని పరీక్షలు చేశారు అనే వివరాలు అధికారులకు నివేదిక రూపంలో అందించాలన్నారు. దీంతోపాటు, పేషెంట్ల వివరాలు ఆన్ లైన్ పోర్టల్ తప్పక నమోదు చేయాలన్నారు.
కరోనా పాజిటివ్ వ్యక్తుల సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల సూచనలు తప్పకుండా అమలు చేస్తామన్నారు.
కార్యక్రమంలో డి.ఎఫ్.ఓ షణ్ముక్ కుమార్, IMA జిల్లా అధ్యక్షులు డా. అశోక్, ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్య ప్రతినిధులు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.