రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
-: వెంకటాచలం, ఏప్రిల్ 02 (సదా మీ కోసం) :-
వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయితీ పరిధిలో రైతులను శనివారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుకరించి వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం లో భూదందాలు . గ్రావెల్ మైనింగ్ మాఫియా. టోల్గేట్ల పేరుతో దోపిడి వంటి దందాలు నిమగ్నమయ్యారని విమర్శించారు.
జిల్లాలో ఏ రోజు అయినా ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల వడ్ల కళ్ళం లో పోయి వారి బాధలు విన్నట్లు మేము చూడ లేదన్నారు.
రైతులకు అండగా మేము భారీ ర్యాలీ చేపట్టామని, అయినా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన రాలేదని,
రైతుల ఉసురు తగిలితే మీరు, మీ ప్రభుత్వం పతనం అవడం ఖాయం అని తెలిపారు.
కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు. గుమ్మడి రాజు యాదవ్, తిరుపతి పార్లమెంటరీ టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మామిళ్ళపల్లి శ్రీనివాస నాయుడు, తిరుపతి పార్లమెంటరీ రైతు విభాగం అధ్యక్షులు రావూరి రాధాకృష్ణన్ నాయుడు, టిడిపి జిల్లా మైనార్టీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి పఠాన్ హుసేన్ ఖాన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.