అల్సర్ కి కార‌ణం ఇది కూడానా….!

Spread the love

అల్సర్ కి కార‌ణం ఇది కూడానా….!

 

జీర్ణాశయంలో పుండ్లకు (అల్సర్‌) రకరకాల అంశాలు కారణమవుతుంటాయి.

సుమారు 17% అల్సర్లకు హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ దోహదం చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లిన తర్వాత వాపుకారక కణాలను విడుదల చేస్తాయి. ఇవి జీర్ణకోశ వ్యవస్థ గోడలకు అంటుకొని దెబ్బతీస్తాయి.

మరో ముఖ్య కారణం ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మాత్రలను దీర్ఘకాలంగా వాడటం.

ముఖ్యంగా వీటిని పెద్దమొత్తంలో తీసుకుంటే జీర్ణకోశం దెబ్బతింటుంది.

కీళ్లనొప్పులు తగ్గటానికి ఇలాంటి రకం మాత్రలను కనీసం 6 నెలల పాటు వాడినవారిలో 68% మందిలో జీర్ణకోశం దెబ్బతిన్నట్టు, 15% మందికి పుండు పడినట్టు గత అధ్యయనాలు వివరిస్తున్నాయి.

సిగరెట్లు కాల్చటం, అతిగా మద్యం తాగటమూ ప్రమాదమే. ఇవి జీర్ణాశయం, పేగుల గోడలు ఉబ్బేలా చేసి, వాటిని దెబ్బతీస్తాయి.

కాబట్టి జాగ్రత్తగా మసలు కోవటం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పోప్‌ ఫ్రాన్సిస్ ఇక లేరు

Spread the loveపోప్‌ ఫ్రాన్సిస్ ఇక లేరు ప్రకటించిన వాటికన్‌ వర్గాలు కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం గత నెల డిశ్చార్జి అయ్యారు. ఆయన […]

You cannot copy content of this page