మైనింగ్ ఇండ‌స్ట్రీ పై స‌మీక్ష నిర్వ‌హించిన మంత్రులు పెద్దిరెడ్డి, మేక‌పాటి

Spread the love

మైనింగ్ ఇండ‌స్ట్రీ పై స‌మీక్ష నిర్వ‌హించిన మంత్రులు పెద్దిరెడ్డి, మేక‌పాటి

  • సచివాలయంలో మైనింగ్ ఇండస్ట్రీపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి సమీక్ష
  • సమీక్షలో పాల్గొన్న మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, డిఎంజి విజి వెంకటరెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు
  • కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ తోడ్పాటు
  • రాష్ట్రంలో సిలికా శాండ్, డోలమైట్, లైమ్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి
  • గ్లాస్‌ తయారీ పరిశ్రమల ఏర్పాటులో కీలకమైన ఖనిజాలు మన సొంతం
  • భారీ గ్లాస్‌ తయారీ పరిశ్రమలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి
  • పారదర్శక పారిశ్రామిక విధానంతో వారికి ప్రోత్సాహం అందిస్తాం
  • మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి

-: అమరావతి, జూన్ 28 (స‌దా మీకోసం) :-

రాష్ట్రంలో ఖనిజ వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నదని రాష్ట్ర భూగర్భగనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డిలు తెలిపారు.

అమరావతి సచివాలయంలో సోమవారం మైనింగ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని డోలమైట్, లైమ్, సిలికాశాండ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ వనరుల లభ్యతపై సమీక్షించారు. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సిలికా శాండ్‌ను వినియోగించుకుని పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూసే వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సందర్బంగా మంత్రులు తెలిపారు.

రాష్ట్రంలో పారిశ్రామిక విధానంను అత్యంత సరళం చేస్తూ, పారిశ్రామిక ప్రోత్సాహం కోసం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల పెంపుదల కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు పారదర్శక విధానంను తీసుకువచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నెల్లూరు, కర్నూలు జిల్లాలో గ్లాస్‌ పరిశ్రమలకు ఉపయోగించే సిలికాశాండ్ నిల్వలు ఉన్నాయని, అలాగే డోలమైట్, లైమ్ ఖనిజ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.

వాటిని వినియోగించుకునేందుకు పలు భారీ పరిశ్రమలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. అటువంటి పరిశ్రమలకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, భూగర్భగనుల శాఖ డైరెక్టర్ (డిఎంజి) విజి వెంకటరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ రవిచంద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అఖండ షూటింగ్ లొకేషన్ కోసం కడప జిల్లా లో దర్శకులు బోయపాటి శ్రీను

Spread the loveఅఖండ షూటింగ్ లొకేషన్ కోసం కడప జిల్లా లో దర్శకులు బోయపాటి శ్రీను -: కడప, జూన్ 28 (స‌దా మీకోసం) :- ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నట సింహా నందమూరి బాలకృష్ణ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అఖండ చిత్రం యొక్క షూటింగ్ కోసం లోకేషన్స్ చూసే నిమిత్తం సోమవారం కడప గడపలో సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన్ను […]

You May Like

error: Content is protected !!